తొలిసారిగా అలా మీట్ అవుతున్న బాలయ్య, కాజల్.. అందుకేనా?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిలిం వీరసింహారెడ్డి ఘనవిజయంతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇటీవలే రిలీజ్ అయింది. ఈ సినిమా చూసిన చాలామంది బాలకృష్ణ నెక్స్ట్ మూవీ అప్‌డేట్స్‌ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నందమూరి అందగాడి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది.

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కొత్త సినిమా కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల బాలకృష్ణ కూతురి పాత్రలో నటిస్తుందని సమాచారం. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందనున్న ఈ మూవీకి NBK108గా వర్కింగ్ టైటిల్ పెట్టారు. నందమూరి బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. కాజల్ ఇటీవల తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 6 నెలల పాటు సినిమాలకు విరామం ఇచ్చింది. ఇప్పుడు తన కెరీర్‌ను పునఃప్రారంభించింది. ఇప్పటికే భారతీయుడు 2 షూటింగ్‌లో పాల్గొంది.

ఇక తాజా గాసిప్ ఏమిటంటే, ఈ చందమామ 2023, మార్చి 4న NBK 108 సెట్స్‌లో జాయిన్ కానుందట. ఆమె సన్నివేశాలు ముందుగా ఫినిష్ చేసి బాలయ్య తర్వాత సెట్స్‌లోకి జాయిన్ అవుతాడట. అలాగే కాజల్‌ను ఆప్యాయంగా సినిమా సెట్స్‌కి బాలయ్య బాబు ఆహ్వానిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇంతకుముందు వరకు బాలకృష్ణ సినిమాలో కాజల్ అసలు నటించలేదు. కానీ ఇప్పుడు నటించడానికి ఒప్పుకుంది. మరి ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

Share post:

Latest