శృతిహాసన్ పై దారుణమైన ట్రోలింగ్.. కారణం..?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం వీరసింహారెడ్డి.ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మర్లేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం జరిగింది. శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. అలాగే కీలకమైన పాత్రలో హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, విజయ్ దునియా నటించారు. ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోయింది.. కానీ సంక్రాంతి విజేతగా మాత్రం నిలవలేకపోయింది అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సమయంలోనే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

Veera Simha Reddy song Suguna Sundari: Balakrishna, Shruti Haasan are on  the top of their dancing game | PINKVILLA
దీంతో థియేటర్లో ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. వీర సింహారెడ్డి ఈనెల 23న ఓటీటి ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రైమ్మింగ్ అవ్వడం జరిగింది. ఈమధ్య థియేటర్లో విడుదలైన సినిమాలన్నీ కూడా ఓటీటి లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. కాంతారా వంటి సినిమాల విషయంలో ఈ విషయం రుజువయింది. సీన్లన్నీ కూడా నెట్టింట వైరల్ గా చేస్తూ పలు రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా వీరసింహారెడ్డి సినిమాలో కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. ఈసారి బాలయ్య కాకుండా ఇందులో నటించిన శృతిహాసన్ని ట్రోల్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Nandamuri Balakrishna, Shruti Haasan, and Gopichand Malineni pose for a  quirky selfie on sets of NBK 107. - India Todayఈ సినిమాలో శృతిహాసన్ కు బాలయ్య మధ్య కొన్ని పరిచయ సన్నివేశాలు ఉన్నాయి. అవి చాలా సిల్లీగా ఉన్నాయని ఇలాంటి సీన్లలో డైరెక్టర్ గోపీచంద్ మల్లిని ఎలా తనని కన్విస్ చేశారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక సన్నివేశంలో శృతి ,బాలయ్య కారణంగా డ్రగ్స్ తీసుకోవడం పిచ్చిపిచ్చిగా ఫ్లోర్ పైన డాన్స్ వేయడం.. వంటి వాటి పైన కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక గతంలో బాలయ్య సీన్ లన్ని కూడా నెటిజన్ ట్రోల్ చేయడం చూశాము కానీ బాలయ్య సినిమాలో నటించిన హీరోయిన్ నీ టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి.

Share post:

Latest