సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం .. కే విశ్వనాథ్ భార్య మృతి..!!

టాలీవుడ్ లో వరుసగా పలు విషాద ఛాయలు నెలకొంటున్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం నటుడు నందమూరి తారక రత్న మరణించిన వార్త మరువకముందే తాజాగా నటుడు డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి భార్య కాశీనాధుని జయలక్ష్మి కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీన కళాతపస్వి విశ్వనాథ్ గారు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. కె విశ్వనాథ్ గారు మరణించినప్పటి నుంచి ఇమే తీవ్ర అనారోగ్య సమస్యకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

K.Vishwanath Top 15 Movies || కె.విశ్వనాధ్ టాప్ 15 సూపర్ హిట్ మూవీస్ ||  Movie Volume | - YouTube
దీంతో కుటుంబ సభ్యులు అపోలో హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స చేయిస్తూ ఉండగా మరణించినట్లు తెలియజేశారు. అయితే పలు అనారోగ్య పరిస్థితులు విషమించడంతో ఈరోజు సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో ఈమె తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యుల తెలియజేయడం జరిగింది. ఇక తమ తండ్రికి విశ్వనాథ్ కన్నుమూసిన వార్డులోని తమ తల్లి జయలక్ష్మి కూడా కన్నుమూయడంతో దురదృష్టకరమని వారు ప్రకటనలో తెలియజేయడం జరిగింది.

జయలక్ష్మి పార్థివ దేహాన్ని కొద్దిసేపట్లో ఫిలింనగర్ ప్రాంతంలో ఉన్న నివాసానికి తరలించబోతున్నట్లు తెలియజేశారు. రేపటి రోజున పంజాగుట్ట స్మశాన వాటికలో ఈమె అంత్యక్రియలు జరగబోతున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఈమె పార్థివ దేహాన్ని కొద్దిసేపటికి ఫిలింనగర్ ప్రాంతంలో ఉన్న నివాసానికి తరలించబోతున్నట్లు తెలియజేశారు. కే విశ్వనాథ్ గారి భార్య జయలక్ష్మి వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు ఈమెకు 15 సంవత్సరాలకి కె విశ్వనాథ్ గారితో వివాహం చేయడం జరిగిందట. తన భర్త మరణించినప్పటి నుంచి జయలక్ష్మి గారు విశ్వనాథ్ గారి మీద ప్రేమతో ఈమె అలాగే మంచానికి పరిమితమైనట్లు తెలుస్తోంది.