ఆ స్టార్ హీరోతో నటించే ఛాన్స్.. అంతలోనే విషాదం.. `అమిగోస్‌` బ్యూటీ కామెంట్స్ వైర‌ల్‌!

ఆషికా రంగ‌నాథ్‌.. ఈ బ్యూటీ ఇటీవ‌లె తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో త‌క్కువ స‌మ‌యంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అందాల సోయ‌గం.. రీసెంట్ గా విడుద‌లైన `అమిగోస్` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇందులో నంద‌మూరి క‌ళ్యాణ్ హీరోగా న‌టించాడు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంతో రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఆషికా మాత్రం త‌న అందం, న‌ట‌న‌తో మంచి మార్కులు వేయించుకుంది. ప్ర‌స్తుతం క‌న్న‌డలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది.

కాలేజీ రోజుల్లో సరదాగా అందాల పోటీల్లో పాల్గొంటే.. క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ అవార్డ్ వచ్చిందని, ఆ ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చి `క్రేజీ బాయ్` మూవీలో న‌టించే అవ‌కాశం ద‌క్కింద‌ని ఆషికా పేర్కొంది. అలాగే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పునీత్ రాజ్ కుమార్ తో కలిసి నటించాలనే కోరిక ఉండేదని.. కోరుకున్న‌ట్లుగానే ఆయ‌న‌తో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది, కానీ, అంత‌లోనే విషాదం చోటుచేసుకుంది. ఆయన మరణించారు.. త‌న‌ కోరిక కలగా మిగిలిపోయిందని ఆషికా తెలిపింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest