జగన్‌ని వదలని బీజేపీ..వైసీపీ వివాదాస్పదం!

మహాశివరాత్రి సందర్భంగా వైసీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. బాలశివుడుకు జగన్ పాలు తాగిస్తున్న ఫోటోపై పెద్ద రచ్చ జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా వైసీపీ అధికార సోషల్ మీడియాలో ఆ పోస్టు పెట్టారు. “  అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన.” “ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటూ…శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.” అంటూ పోస్టు పెట్టారు.

అయితే అలా జగన్ పాలు తాగిస్తున్నట్లు ఫోటో పెట్టడంపై ఏపీ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని, తక్షణమే ఆ ఫోటోని తొలగించాలని, జగన్ క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అలాగే వైసీపీకి వైఖరికి నిరసనగా, ఆదివారం శివాలయాల వద్ద నిరసనకు దిగారు. జగన్‌ హిందూ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. హిందువులకు సీఎం క్షమాపణ చెప్పాలంటూ పలు ఆలయాల వద్ద కమలం పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.

https://twitter.com/YSRCParty/status/1626840352119468032

మహా శివరాత్రి రోజు శివుడికి పాలాభిషేకం చేయవద్దనే పిలుపునిచ్చే పోస్టు సీఎం జగన్‌ ఫొటోతో పెట్టడం హేయమైన చర్య అని, పేద పిల్లలకు పాలు అందించడం, శివుడి అభిషేకం వేర్వేరు అంశాలని బి‌జే‌పి నేత లంకా దినకర్ అన్నారు. అటు వైసీపీ ఫోటోపై ఏపీ టి‌డి‌పి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఫైర్ అయ్యారు.

https://twitter.com/YSRCParty/status/1627258428229042176

అయితే ఆ ఫోటోపై వైసీపీ సోషల్ మీడియా వివరణ ఇచ్చింది. “ప్రపంచంలో అణువణువునా శివుడు కొలువై ఉన్నాడు.. మంచి అన్నది ప్రతీది దైవమే.. అదే శివతత్వం. ఇందులో శివుడిని అవమానించడం ఎక్కడ జరిగిందో ఆ పరమాత్ముడికే ఎరుక.” అంటూ మరో ట్వీట్ చేసింది. కానీ దీనిపై బి‌జే‌పి ఫైర్ అవుతూనే ఉంది. ఆ ఫోటో తొలిగించాలని డిమాండ్ చేస్తుంది.