సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల భామ అనుష్క శెట్టి.. సినిమాలు చేయడంలో మునుపటి జోరు చూపించడం లేదు. చాలా నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం యంగ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే. అనుష్క కెరీర్ లో 48వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. చాలా రోజుల నుంచి బయట కనిపించని అనుష్క తాజాగా బెంగళూరులో మెరిసింది. మహాశివ రాత్రి ఉత్సవాల్లో ఆమె కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే అనుష్క లేటెస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ లబోదిబోమంటున్నారు. ఎందుకంటే, తాజా ఫోటోల్లో అనుష్క చాలా బొద్దుగా కనిపిస్తోంది. ట్రెడిషనల్ గా వైట్ చుడిదార్ లో అనుష్క అక్కడ దర్శనమిచ్చింది. అనుష్క అందం చెక్కు చెదరనప్పటికీ.. ఆమె బొద్దుగా ఉండటమే ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం ఎయిర్‌పోర్ట్ లో అనుష్క కాస్త నాజూగ్గానే కనిపించింది. కానీ, ఇంతలోనే మళ్లీ బొద్దుగా మారిపోయిందేంటి అంటూ తాజా పిక్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
I literally just stopped breathing!🤍#AnushkaShetty pic.twitter.com/RS6hbT2f3x
— Aademry (@aademry14) February 18, 2023