సమంత ముందుకు వచ్చిన మరో మ్యారేజ్ ప్రపోజల్.. రెండో పెళ్ళికి సిద్ధమా??

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక 2018లో అక్కినేని నాగచైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు ఆ తరువాత కొన్ని మనస్పర్థల కారణంగా 2021 లో విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై చాలా రోజుల వరకూ సోషల్ మీడియాలో పెద్ద వారే జరిగింది. ఇప్పుడిప్పుడే ఆ విషయం గురించి మర్చిపోతున్న సమయంలో అభిమానులు ఇప్పుడు సమంత పెళ్లి గురించి కొత్త చర్చ మొదలు పెట్టారు.

సమంతకి ఇప్పుడు 35 ఏళ్ళు. పెళ్లి చేసుకోడానికి ఇదే కరెక్ట్ టైమ్‌. లేట్ అయ్యేకోది ఏజ్ ఎక్కువైయిపోతుందని కొంతమంది సామ్ కి సలహా ఇస్తున్నారు. అయితే సామ్ కి మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోడం ఇష్టం లేదని సమాచారం. కానీ సద్గురు స్వామీజీ సమంత కోసం ఒక అబ్బాయిని చూశారని, అతని సామ్ పెళ్లిచేసుకోబోతుంది అని పుకార్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఎవరికి తెలీదు.

అయితే అసలు విషయంలోకి వెళ్తే.. సమంతకి పెళ్లి ప్రపోసల్స్ రావడం మాత్రం నిజం. ఆమె అభిమానుల్లో కొంతమంది సామ్ ని పెళ్లి చేసుకోడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవలే సమంత ఒక అందమమైన ఫోటోని అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక ఆ ఫోటోకి అభిమానులు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఒకరు ‘మేడం మా ఇంటికీ రండి భోజనం పెడతాను ‘ కామెంట్ చేస్తే, మరొకరేమో ‘మిమల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి?’ డైరెక్ట్ గా మ్యారేజ్ ప్రపోజల్ ముందు ఉంచాడు. అయితే సమంత అపుడప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సరదాగా తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం ఇలాంటి క్వశ్చన్లు ఆమె సరదాగా తీసుకునే మూడ్‌లో లేదని తెలుస్తోంది.

Share post:

Latest