ఫైన‌ల్ గా పెళ్లి పీట‌లెక్క‌బోతున్న ర‌ష్మీ.. ప్ర‌ముఖ బిజినెస్ మెన్‌తో ఏడ‌డుగులు!?

సినిమాల ద్వారా కెరీర్ ప్రారంభించిన అందాల భామ రష్మీ గౌతమ్.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించింది. కానీ ఏ భాషలోనూ రష్మీకి సరైన గుర్తింపు దక్కలేదు. సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో రష్మీ యాంకర్ గా మారింది. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో య‌మా పాపులర్ అయింది.

ప్రస్తుతం బుల్లితెర‌పై స్టార్ యాంకర్ గా సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే.. ర‌ష్మీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. ఈ అందాల యాంక‌ర్ పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ట‌. 34 ఏళ్ల ర‌ష్మీ ఓ ప్ర‌ముఖ బిజినెస్ మెన్‌తో ఏడ‌డుగులు వేయ‌బోతోంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ త‌న‌కు కాబోయే వాడిని అంద‌రికీ ప‌రిచ‌యం చేసి.. పెళ్లి తేదీని ప్ర‌క‌టిస్తుంద‌ని నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

కాగా, గ‌త కొన్నేళ్ల నుంచి సుడిగాలి సుధీర్ తో ర‌ష్మీ ప్రేమ‌లో ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. వెండితెర‌పై ప్ర‌భాస్‌-అనుష్క జోడీకి ఎంత‌టి క్రేజ్ ఉందో.. బుల్లితెర సుధీర్‌-ర‌ష్మీ జోడీకి కూడా అంతే క్రేజ్ ఉంది. వీరిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకుంటార‌ని ఎన్నో సార్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ, సుధీర్‌-ర‌ష్మీ తాము కేవ‌లం ఫ్రెండ్స్‌ మాత్ర‌మే అని.. త‌మ మ‌ధ్య ప్రేమ లేద‌ని ప‌లు మార్లు క్లారిటీ ఇచ్చారు.

Share post:

Latest