కొత్త ప్రియుడితో ద‌ర్శ‌న‌మిచ్చిన‌ అమీ జాక్సన్.. రొమాంటిక్ పిక్స్ తో రచ్చ‌!

అమీ జాక్సన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎవడు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ భామ‌.. తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో న‌టించింది. అయితే ఏ ఇండ‌స్ట్రీలోనూ ఈ బ్యూటీకి స్టార్ హోదా ద‌క్క‌లేదు. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న స‌మ‌యంలో బ్రిటన్‌కు చెంది హోటల్ వ్యాపారవేత్త జార్జ్ పనయోటౌతో అమీ ప్రేమ‌లో ప‌డింది.

వీరికి 2019లో ఓ కుమారుడు జ‌న్మించాడు. అయితే కొడుకు పుట్టిన మూడేళ్లకే జార్జ్, అమీ విడిపోయారు. పెళ్లి కాకుండానే డేటింగ్.. బిడ్డకు జన్మనివ్వడం.. బ్రేకప్.. జరిగాయి. అయితే తాజాగా అమీ జాక్సన్ త‌న కొత్త ప్రియుడితో ద‌ర్శ‌న‌మిచ్చింది. ప్రస్తుతం అమీ జాక్సన్ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్వీక్ తో రిలేషన్ లో ఉంది.

వాలంటైన్స్ డే సందర్భంగా తన కొత్త ప్రియుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. ప‌లు రొమాంటిక్ ఫోటోల‌ను ఇన్‌స్టా ద్వారా షేర్ చేస్తూ.. హ్యాపీ వాలెంటైన్స్ డే బేబీ.. నీ అంతులేని ప్రేమకు కృతజ్ఞతలు అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోల్లో ఇద్దరూ నాలుకలతో ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. వెస్ట్వీక్ అమీ జాక్సన్ చెవులు కొరికేస్తూ కౌగిలిలో ఆమెని బంధిస్తూ ర‌చ్చ చేశారు. ఈ పిక్స్ చూసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. కొందరు క్యూట్ కపూల్ అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు బాగా బ‌రితెగించేశావ్ అంటూ అమీ తీరున విమర్శిస్తున్నారు.

https://www.instagram.com/p/CopuwMlLK_E/?utm_source=ig_web_copy_link

Share post:

Latest