అల్ల‌రి న‌రేష్‌ `ఉగ్రం` క‌థ న‌చ్చినా స‌రే ఆ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడు?

అల్ల‌రి న‌రేష్ నుంచి త‌ర్వ‌లో `ఉగ్రం` అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. నాందితో త‌న‌కు సూప‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌లతో అల్ల‌రి న‌రేష్ చేసిన చిత్ర‌మిది. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ గా సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మిస్తున్న ఈ సినిమాతో మిర్నా అనే హీరోయిన్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతోంది.

ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ఒక యాంగ్రీ పోలీస్ అఫీస‌ర్ పాత్ర‌లో న‌టించారు. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ సినిమాకు టీజ‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా అల్ల‌రి న‌రేస్ త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించాడు. అయితే `ఉగ్రం`కు ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ కాద‌ట‌. మొద‌ట విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ సినిమా క‌థ‌ను అక్కినేని నాగ‌చైత‌న్య‌కు వినిపించాడ‌ట‌. ఆయ‌న‌కు క‌థ బాగా న‌చ్చింద‌ట‌.

కానీ, చైతు ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య `క‌స్ట‌డీ` అనే మూవీ చేస్తున్నాడు. వెంక‌ట్ ప్ర‌భు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పోలీస్ పాత్ర చేస్తుండటం, క్యారక్టరైజేషన్ దాదాపు క‌స్ట‌డీకి దగ్గరగా ఉండటం వల్ల నాగ చైత‌న్య ఉగ్రంను వద్దనుకున్నాడట. ఆ త‌ర్వాత అల్ల‌రి న‌రేష్ కు క‌థ న‌చ్చి వెంట‌నే సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది.

Share post:

Latest