ఆ రోజు ప‌వ‌న్ చేసిన ప‌ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను.. లయ ఓపెన్ కామెంట్స్‌!

ప్ర‌ముఖ న‌టి ల‌య గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్వయంవరం వంటి సూప‌ర్ హిట్ మూవీతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ల‌య‌.. మనోహారం, ప్రేమించు, పెళ్ళాంతో పనేంటి, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కెరీర్ ఊపందుకుంటుంది అన్న స‌మ‌యంలో అమెరికాలో స్థిర‌ప‌డ్డ గణేష్ గోర్తీ అనే డాక్టర్ ని వివాహం చేసుకుంది.

2006లో లయ వివాహం జరిగింది. పెళ్లి త‌ర్వాత కొన్నాళ్లు తెర‌పై క‌నిపించినా.. ఆ త‌ర్వాత న‌ట‌న‌కు దూర‌మై ఆమెరికాకు వెళ్లిపోయింది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ల‌య‌.. కెరీర్, పర్సనల్ లైఫ్, భ‌ర్త‌, పిల్ల‌ల గురించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు ఇచ్చిన ప‌ర‌చిపోలేని ఓ స‌ర్‌ప్రైజ్‌ను కూడా వివ‌రించింది. ల‌య త‌న పెళ్లికి చిరంజీవిగారినీ ఆహ్వానించింద‌ట‌. అలాగే పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి పరిచయం లేక‌పోయినా.. ఆయ‌న వ‌ద్ద‌కు నేరుగా వెళ్లి త‌న వివాహానికి ఆహ్వానించ‌ద‌ట‌.

“నేనెవరో కనీసం ఆయనకి తెలుసో లేదో అనే అనుమానంతో ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళా. కానీ ఆయన రిసీవ్ చేసుకున్న విధానం చూసి ఆశ్చర్యపోయా. పెళ్లికి వ‌స్తాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు చెప్పినా.. నాకు అనుమానం ఉండేది. చిరంజీవి గారు మాత్ర‌మే వస్తారని అనుకున్నా. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు అందరికంటే ముందే వచ్చి సర్ప్రైజ్ చేశారు. `అన్నయ్య చిరంజీవి గారు కూడా వస్తున్నారు ఆన్ ది వే లో ఉన్నారమ్మా` అని ఆయ‌న చెప్పడం నా లైఫ్ లో మరచిపోలేని మధురమైన అనుభూతి` అంటూ లయ చెప్పుకొచ్చింది.

Share post:

Latest