ఆఫ‌ర్లు కావాలంటే ఒంట‌రిగా ర‌మ్మ‌నేవారు.. ఆమ‌ని అనుభ‌వాలు!

న‌టి ఆమని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నిన్నటి తరం కథానాయికలలో ఓ వెలుగు వెలిగిన ఆమని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలు గురించి కూడా బయటపెట్టారు. ఆఫ‌ర్లు కావాలంటే ఒంట‌రిగా ర‌మ్మ‌నేవారు అంటూ ఆమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. `కెరీర్ స్టార్టింగ్ లో అవ‌కాశాల కోసం నేను సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. అక్కడ చాలా రకాల పరిస్థితులు చూశాను. నేను ఏ సినిమా ఆఫీసుకి వెళ్లినా మా అమ్మ నా కూడా వచ్చేది.

అయితే కొంద‌రు అమ్మ లేకుండా ఒంట‌రిగా ర‌మ్మ‌నేవారు. ఆమె లేకుండా నేను రాను అని చెప్పేదానిని. ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారనేది తెలియడానికి నాకు కొంత సమయం పట్టింది.` అంటూ ఆమ‌ని చెప్పుకొచ్చింది. మొత్తానికి త‌న‌కు కాస్టింగ్ కౌచ్ అనుభ‌వాలు ఎదుర‌య్యాయ‌ని అమ‌ని ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పేసింది. దీంతో ఆమ‌ని కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest