20 రోజులకు 80 కోట్లు.. పవన్ తో రిస్క్ చేస్తున్న నిర్మాతలు..!!

కరోనా సమయం నుంచి సినిమాల బడ్జెట్ విషయంలో పలు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు నిర్మాతలు. ముఖ్యంగా స్టార్ హీరోల పారితోషక విషయంలో కూడా అడ్డు అదుపు లేకుండా పెంచేస్తూ ఉన్నారు. ఇటీవల కొంతమంది పెద్దలు పలు సందర్భాలలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వీరి మాటలకు కొంతమంది పారితోషకాలు తగ్గించుకోవడం కోసం స్టార్స్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు కూడా వినిపించాయి. కానీ అవన్నీ నీటి మీద రాతలు గానే మిగిలిపోయాయి

Pawan Kalyan Samudra Khani : సీనియర్ ఆర్టిస్టుని 'ఛీ' కొట్టిన పవన్  కళ్యాణ్..వైరల్ అవుతున్న న్యూస్ - OK Telugu
ఎంతోమంది స్టార్ హీరోలు సైతం రూ .50 నుంచిరూ .100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రభాస్ ,పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉన్న రెండు వర్గాలలో వీరు ఇంతటి రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న కొన్ని సినిమాలు వందల కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ తర్వాత స్థాయిలో హీరోగా పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే వినిపిస్తోంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరొక మూడు సినిమాలను లైన్ లో పెట్టారు.

ఇవన్నీ లైన్ లో ఉండగానే మరొక రీమిక్స్ సినిమాని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు తమిళంలో సముద్రఖని తెరకెక్కించిన వినోదాయ సీతం రీమెక్కుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సాయి ధరంతేజ్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో కేతికాశర్మ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కేవలం ఈ సినిమా కోసం 20 రోజులు సమయాన్ని కేటాయించారట. అందుకోసం ఆయన రూ .80 కోట్ల గా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇన్ సైడ్ టాక్. దీంతో పలువురు నెటిజెన్లు సైతం నిర్మాతలు పవన్తో చాలా రిస్కు చేస్తున్నారని విధంగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇదేమి పెద్ద సమస్య కాదని తెలియజేస్తున్నారు.

Share post:

Latest