తునిపై దాడిశెట్టి పట్టు..యనమల ఫ్యామిలీకి చిక్కులే!

2009 ముందు వరకు యనమల ఫ్యామిలీ కంచుకోటగా ఉన్న తుని నియోజకవర్గం ఇప్పుడు దాడిశెట్టి అడ్డాగా మారిపోయిందనే చెప్పాలి. 1983 నుంచి 2004 వరకు వరుసగా అయిదుసార్లు యనమల రామకృష్ణుడు టి‌డి‌పి తరుపున తునిలో సత్తా చాటారు. 2009లో ఓటమి పాలయ్యారు. దీంతో 2014 ఎన్నికల బరిలో తప్పుకుని తన సోదరుడు యనమల కృష్ణుడుకు సీటు ఇచ్చారు. కృష్ణుడు కూడా ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఓడిపోయారు.

వరుసగా వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలిచారు. ఇప్పుడు ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో చాలామంది మంత్రుల బలం తగ్గుతుంటే..రాజా బలం ఏ మాత్రం తగ్గడం లేదు. తునిలో ఆయన బలం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల వచ్చిన ప్రతి సర్వేలోనూ తునిలో రాజా గెలుపు ఖాయమని అంటున్నాయి. వాస్తవానికి రాజా అనుకున్న మేర తునిలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయడం లేదు. కాకపోతే ప్రభుత్వ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి.

అదే సమయంలో యనమల ఫ్యామిలీపై ఉన్న నెగిటివ్ రాజాకు బాగా కలిసొస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు యనమల ఫ్యామిలీ చేసిన పనులు ఇప్పుడు రివర్స్ అయ్యాయని, అందుకే అక్కడ నెగిటివ్ ఉందనే పరిస్తితి. పైగా సొంత పార్టీ నేతలే మళ్ళీ యనమల ఫ్యామిలీకి సీటు ఇవ్వవద్దని అంటున్నారు. తుని సీటు ఈ సారి కృష్ణుడుకు కాకుండా తన కుమార్తెకు దక్కించుకోవాలని యనమల చూస్తున్నారు. దానికి కృష్ణుడు ఒప్పుకోవడం లేదు.  ఇలా యనమల ఫ్యామిలీలో రచ్చ ఉంటే..ఈ సీటుని కాపు నేతకు ఇవ్వాలని డిమాండ్ వస్తుంది.

ఇక ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సైతం యాక్టివ్ గానే ఉన్నారు..ఈ మధ్యే చంద్రబాబుని కూడా కలిసొచ్చారు. దీంతో ఆయనకు సీటు ఇస్తారని ప్రచారం మొదలైంది. కానీ సీనియర్ యనమల మాట కాదని వేరే వాళ్ళకు సీటు దక్కడం కష్టమే. ఎవరికి సీటు వచ్చిన తునిలో దాడిశెట్టికి చెక్ పెట్టడం కూడా కష్టమే అన్నట్లు ఉంది.

Share post:

Latest