బాలయ్య మజాకా..నందమూరి అభిమానులకు హానీరోజ్ కావాలంట‌..!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీర సింహారెడ్డి. మైత్రి మూవీ బ్యానర్ పై గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న వీర సింహారెడ్డి ట్రైలర్ ఊపు తగ్గేలోపు నిన్న ఈ సినిమాలోని మాస్ మొగుడు సాంగ్ కూడా రిలీజ్ చేశారు.

Veera Simha Reddy: 'వీరసింహారెడ్డి' గా బాలయ్య.. మాస్ లుక్ లో అరాచకం - NTV Telugu

ఇటీవ‌ల కాలంలో ఏ సినిమా క్రియేట్ చేయని పాజిటివ్ బ‌జ్‌ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయినా ఈ సినిమా యూనిట్. ఇప్పుడు సంక్రాంతికి మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. బాలయ్య వ్యాఖ్యాతగా చూస్తున్న అన్ స్టాపబుల్ తాజాగా రాబోయే ఎపిసోడ్‌లో ఈ సినిమా యూనిట్‌ సందడి చేయబోతున్నారట. దీనిని సంక్రాంతి కానుకగా ఆహాలో స్పెషల్ ఎపిసోడ్ గా టెలికాస్ట్ చేయబోతున్నామంటూ ఆహా టీమ్‌ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

Balakrishna's Unstoppable achieves a Rare Feat

అందులో భాగంగా ఈసారి పండుగకి బాలయ్య తరపు నుంచి ఒక మాస్ కానుక.. గాడ్‌ ఆఫ్ మోసస్ విత్ ది టీమ్ ఆఫ్ వీర సింహారెడ్డి.. అన్ స్టాపబుల్ సంక్రాంతి సెలబ్రేషన్స్ విత్ NBK కమింగ్ సూన్ అంటూ ఆహా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఎపిసోడ్‌లో ఎవరెవరు వస్తారు అనే విషయాలపై ఇంకా క్లారిటీ లేదు.

Veera Simha Reddy Movie Pre Release Event Photos - Cine Chit Chat

నందమూరి అభిమానులు మాత్రం ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో హనీ రోజ్‌ కూడా ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్‌లు పెడుతున్నారు. ఈ సినిమాలో మా బావ మనోభావాలు అనే పాటలో బాలయ్యతో కలిసి చిందేసింది హనీ రోజ్. ఈ ఎపిసోడ్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Share post:

Latest