అజిత్ మూవీ ‘తెగింపు’ ఫ్లాప్‌కి కారణం ఇదే… ఆ రీజన్ వల్లే ఫ్లాప్ అంటూ టాక్?

 

కోలీవుడ్ హీరో అజిత్, టాలెంటెడ్ యాక్ట్రెస్ మంజు వారియర్ కలిసి నటించిన ‘తెగింపు (తమిళంలో తునీవు)’ సినిమా ఈరోజు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా రికార్డు స్థాయి థియేటర్స్‌లో విడుదలై అంచనాలను భారీగా పెంచేసింది. ఐతే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో బుకింగ్స్ రాలేదు. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలో కనీసం 10 శాతం బుకింగ్స్ కూడా దాటలేదట. నిజానికి తెగింపు సినిమాకి టాక్ కూడా ఉహించిన స్థాయిలో లేకపోవడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వినపడుతున్నాయి.

ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన తొలి భారీ సినిమా తెగింపు అని చెప్పవచ్చు. అజిత్ తెలుగువారికి చాలా సినిమాల ద్వారా సుపరిచితుడు అయ్యాడు. కానీ ఈ కొత్త తెగింపు సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఈ మూవీ కథలో కొత్తదనం ఏమి లేదట. అజిత్ నటించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందువల్ల తెగింపు సినిమా అజిత్ అభిమానులకు మాత్రం కచ్చితం గా నచ్చుతుంది. కానీ మిగితా వారిని పెద్దగా ఆకర్శించలేదు అని టాక్.

అజిత్ ఈమధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాలోనే నటిస్తున్నాడు. మంచి కంటెంట్ ఉంటే తప్ప యాక్షన్ సినిమాల వైపు ప్రేక్షకులు చూసేందుకు కూడా ఇష్టపడడం లేదు. అజిత్ మాత్రం బలహీనమైన సినిమా కథలతో యాక్షన్ మూవీస్ చేస్తూ ఆడియన్స్‌కి కూడా బోర్ కొట్టిస్తున్నాడు. కొంతమంది అభిప్రాయాల ప్రకారం, తెగింపు కథ బాగానే ఉన్నా దానిని ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సో, ఈ సినిమాకి అదే మైనస్ అయిందని అనుకోవచ్చు.

ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అజిత్ కి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ తెలుగులో యాక్షన్ సినిమా చూసేంత ఆసక్తి ఉండకపోవచ్చు. ఇక తెగింపు సినిమాలో అజిత్ నటన, BGMs కొన్ని సీన్స్ చూడదగినంత బాగున్నాయని టాక్. ప్లస్ పాయింట్స్ ఉన్నా, ఈ మూవీ తెలుగులో సక్సెస్ కావడం కష్టమేనని చెప్పవచ్చు.