సీఐడీ డీజీ బ‌దిలీ వెనుక వైసీపీలో ఒక్క‌టే గుస‌గుస‌లు…!

సీఐడీ డీజీ.. ఆ విభాగం చీఫ్ సునీల్ కుమార్‌ను అనూహ్యంగా సీఎం జ‌గ‌న్ కొన్ని రోజుల కింద‌ట త‌ప్పించా రు. అయితే.. ఆయ‌న‌ను ఎందుకు ఆ పోస్టు నుంచి త‌ప్పించారు? అనేది మాత్రం మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న గానే మిగిలిపోయింది. దీనిపై అనేక విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు డీజీపీగా ప‌దోన్న‌తి క‌ల్పించ‌నున్నార‌ని కూడా కొంద‌రు పేర్కొన్నారు. అయితే.. దీనికి మ‌రో కార‌ణం.. మౌలిక‌, కీల‌క కార‌ణంపై తాడేప‌ల్లి వ‌ర్గాలు భిన్నంగా రియాక్ట్ అవుతున్నాయి.

We don't recognise US lab, says CID addl DIG P V Sunil Kumar

ఒక‌టి.. కొన్ని రోజుల కింద‌ట స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌తో సునీల్ కుమార్ రాష్ట్రంలో వైసీపీ ప‌రిస్థి తిపై స‌ర్వే చేయించార‌ని అంటున్నారు. ఈ సర్వేలో వైసీపీకి వ్య‌తిరేకంగా రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని.. దీనిని సీఎం కు చూపించ‌లేక‌.. సునీల్ దాచిపెట్టార‌ని.. అందుకే జ‌గ‌న్ ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని అంటున్నా రు. అదేవిధంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ పుంజుకున్న‌ట్టుగా స‌ద‌రు నివేదిక స్ప‌ష్టం చేసింద‌ని అంటున్నారు.

ఈ కార‌ణంగానే సీఎం జ‌గ‌న్ సునీల్‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని మ‌రో వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. అంటే.. టీడీపీ పుంజుకోకుండా.. కంట్రోల్ చేయ‌డంలో సునీల్ విఫ‌ల‌మ‌య్యార‌నే భావ‌న సీఎం జ‌గ‌న్‌లో ఉంద‌ని అందుకే.. ఆయ‌న సునీల్‌ను త‌ప్పించార‌ని ఓ వ‌ర్గం చెబుతోంది. ఏదేమైనా.. టీడీపీ పుంజుకోవ‌డం అనేది స‌హ‌జంగా జ‌రిగిన ప్ర‌క్రియ‌. ఒక‌టి టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్వ‌యంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావ‌డంతో పాటు.. పార్టీని బ‌లోపేతం చేశారు.

ఈ కారణంగానే పార్టీ పుంజుకుంది. అయితే.. అప్ప‌టికీ.. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల కార‌ణంగా.. సీఐడీ అధికారులు దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో టీడీపీ నేత‌ల‌పై అర్ధ‌రాత్రి కేసుల న‌మోదు.. అరెస్టులు తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ పుంజుకోవ‌డం ఏంటనేది సీఎం జ‌గ‌న్ ఆశ్చ‌ర్య అయి ఉంటుంది. అందుకే.. సునీల్ను ప‌క్క‌న పెట్టార‌నే మ‌రో వాద‌న కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.