మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తమన్నా.. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసింది. మూడు పదుల వయసులోనూ వరుస అవకాశాలను అందుకుంటే సత్తా చాటుతోంది. కానీ పెళ్లి జోలికి మాత్రం వెళ్లడం లేదు. గతంలో తమన్న పెళ్లి పై ఎన్నో వార్తలు వచ్చినా.. వాటిని తమన్నా ఖండిస్తూ వచ్చింది.
అయితే తాజాగా ఈమె ప్రేమ వ్యవహారం బట్టబయలు అయింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ఎప్పటి నుంచో సీక్రెట్ గా ప్రేమాయణం నడిపిస్తుందట. విజయ్ వర్మ తెలుగులో నాని హీరోగా నటించిన `ఎంసీఏ` చిత్రంలో విలన్‌గా కనిపించాడు. అయితే సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన `లస్ట్ స్టోరీస్ 2` వెబ్ సిరీస్ సెట్స్‌లో విజయ్ వర్మ, తమన్నాకు మధ్య పరిచయం ఏర్పడిందట.
ఈ పరిచయం ప్రేమగా మారడంతో.. గత కొద్ది నెలల నుంచి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇక న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా తమన్నా లవ్ ఎఫైర్ బయట పడింది. తమన్నా, విజయ్ వర్మ కలిసి గోవాలో నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు. 2023కి స్వాగతం పలుకుతూ గోవాలో ముద్దులు పెట్టుకున్న వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. అలాగే వీరు క్లోజ్ గా దిగిన ఫోటోలు సైతం సోసల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.