తాడేపల్లిగూడెంలో ట్విస్ట్..సీటుపై టీడీపీ-జనసేన పట్టు!

నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇక అధికారికంగానే పొత్తుపై ప్రకటన రావాలి. ఇక పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు టి‌డి‌పి ఇవ్వాలి. ఇదే సమయంలో ఆల్రెడీ కొన్ని సీట్లని జనసేన కోసం టి‌డి‌పి కేటాయించడానికి రెడీ అయిందనే ప్రచారం ఉంది.

ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా మూడు సీట్లు మాత్రం జనసేనకు దక్కుతాయని ముందు నుంచి ప్రచారం ఉంది. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం సీట్లు జనసేనకే ఇస్తారనే ప్రచారం ఉంది. ఇంకా వేరే సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది గాని..ఈ మూడు మాత్రం ఫిక్స్ అని ప్రచారం వచ్చింది. అయితే తాజాగా మాత్రం తాడేపల్లిగూడెం సీటు విషయంలో కొత్త ట్విస్ట్ వచ్చింది.

ఈ సీటులో పోటీకి రెడీగా ఉండాలని ఇంచార్జ్ వలవల బాబ్జీకి టీడీపీ అధిష్టానం సంకేతాలు ఇచ్చిందట. అక్కడ పార్టీ బలపడిందని, బాబ్జీ ఇంచార్జ్ గా వచ్చి పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లారని, కాబట్టి ఇక్కడ టీడీపీ గెలుపుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి…ఈ సీటులో పోటీకి బాబ్జీని రెడీగా ఉండాలని సంకేతాలు అందాయట. అదే సమయంలో ఈ సీటు కోసం జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ సైతం గట్టిగా ట్రై చేస్తున్నారు.

ఇక్కడ ఆయనకు బలం ఉంది..గత ఎన్నికల్లో వైసీపీకి 70 వేల ఓట్లు పడితే..టీడీపీకి 54 వేలు, జనసేనకు 36 వేల ఓట్లు పడ్డాయి. అంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీ గెలిచేది కాదు. అందుకే ఈ సారి రెండు పార్టీల మధ్య పొత్తు అంటున్నారు. కానీ ఈ సీటు విషయంలో మొదట నుంచి జనసేనకే ఇస్తారని అన్నారు..మరి ఇప్పుడు టీడీపీకి అంటున్నారు. మరి చివరికి సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.

Share post:

Latest