20 సంవత్సరాల్లో 300కు పైగా సినిమాల్లో నటించి సౌత్ ఇండస్ట్రీలో ఎదురులేని హీరోయిన్గా రాణించింది మాధవి. ఈమె అసలు పేరు కనక విజయలక్ష్మి. ఈమె పుట్టింది ఏలూరులో. 17 ఏళ్లపాటు వయసులోనే సినిమా రంగంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుబిడ్డ తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో కూడా కథానాయికగా చేసింది. మెగాస్టార్ చిరంజీవి – మాధవి జోడి అప్పట్లో ఒక హిట్ పెయిర్ అని చెప్పొచ్చు. 1985 -90 మధ్యకాలంలో విజయశాంతి , శ్రీదేవి లాంటి టాప్ హీరోయిన్లు కూడా ఈమెకు పోటీ ఇవ్వలేకపోయారు.
30 ఏళ్ల క్రితమే బికినీ ధరించి తెలుగు సినిమా పరిశ్రమకు గ్లామర్ అద్దిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన తర్వాత మెల్లిమెల్లిగా దానికి దూరం కావడం మొదలుపెట్టింది. ఆపై ఆధ్యాత్మిక గురువు రామస్వామికి మంచి భక్తురాలు అయింది. ఆ స్వామి సలహా ప్రకారం వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మను పెళ్లాడింది. రాల్ఫ్ శర్మ తల్లి జర్మన్ కాగా ఆయన తండ్రి ఇండియన్. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత మాధవి ఇండియా వదిలి అమెరికాలో స్థిరపడింది. టిఫాని శర్మ, ప్రసిల్లా శర్మ, ఎవ్లిన్ శర్మ ఇలా ముగ్గురు కూతుర్లకు జన్మనిచ్చింది. వారు పెద్దయిన తర్వాత బిజినెస్ రంగంలోకి ఆమె అడుగు పెట్టింది.
తన భర్తకున్న మెడికల్ కంపెనీలను ప్రస్తుతం మాధవి నడుపుతోంది. అంతేకాదు, అమెరికాలో మాధవి ఫుడ్ రెస్టారెంట్స్ కూడా మొదలుపెట్టి బాగా డబ్బులు సంపాదిస్తోంది. మెడికల్ కంపెనీలతోపాటు రెస్టారెంట్ ద్వారా కొన్ని వేల కోట్లను వెనకేసుకుందని సమాచారం వాటితో ఆమె ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా కొనుగోలు చేయగలదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక స్టార్ హీరోయిన్గా ఎదిగి ఆపై వ్యాపారంలో కూడా రాణించి వేలాది కోట్లకు మాధవి అధిపతి కావడం నిజంగా చెప్పుకోదగిన విషయమేనని చెప్పవచ్చు.