ఆ ప‌నికి ఒప్పుకోలేదు కాబ‌ట్టే ఆఫ‌ర్లు రాలేదు.. స్నేహా ఉల్లాల్ షాకింగ్ కామెంట్స్‌!

స్నేహా ఉల్లాల్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 2005 లో `లక్కీ: నో టైమ్ ఫర్ లవ్` లో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఈ చిత్రం త‌ర్వాత ఐశ్వర్య రాయ్ లా కనిపించడంలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అప్ప‌ట్లో స్నేహా ఉల్లాల్ ను జూనియ‌ర్ ఐశ్వ‌ర్య రాయ్ అని కూడా పిలిచేశారు. ఆఫ‌ర్లు కూడా బాగానే ఉన్నాయి.

తెలుగులో కింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహా త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. టాలీవుడ్ లో ఈ అమ్మ‌డు స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని భావించారు. కానీ, అనూహ్యంగా ఈ బ్యూటీకి ఆఫ‌ర్లు త‌గ్గిపోయాయి. దాంతో స్నేహా ఇండ‌స్ట్రీలో క‌నుమ‌ర‌గు అయిపోయింది. 2015లో సినిమాలకు దూరం అయిన స్నేహా ఉల్లాల్‌.. గ‌త ఏడాది `లవ్ యూ లోక్ తంత్ర` సినిమాలో రీఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో పాటు ఐటెం సాంగ్స్ లో కూడా న‌టిస్తోంది. ఓ తెలుగు సినిమాలో కూడా ఐటం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

అయితే కెరీర్ లో ఎదుగుతున్న స‌మ‌యంలో ఉన్న‌ట్లుండి ఆఫ‌ర్లు రాక‌పోవ‌డంపై తాజాగా స్నేహా ఉల్లాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమాల ఎంపికతో పాటు.. ఎక్స్ పోజింగ్ విషయంలో తనకంటూ కొన్ని పరిమితులు పెట్టుకోవడం వల్లే హీరోయిన్ గా వెనకబడ్డానని ఆమె తెలిపింది. స్కిన్ షోకి, హాట్ హాట్ గా కనిపించ‌డానికి ఒప్పుకోలేదు కాబ‌ట్టే ఆఫ‌ర్లు రాలేద‌ని, కాస్త రూల్స్ బ్రేక్ చేసి ఉంటే త‌న‌ పరిస్థతి వేరేలా ఉండేది స్నేహా ఉల్లాల్ చెప్పుకొచ్చింది. తాను గీసుకున్న గీత కెరీర్ లో తనను ఎదగనీయకుండా చేసింద‌ని ఆమె పేర్కొంది. దీంతో స్నేహా ఉల్లాల్ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.