శారీలో మ‌రోసారి మంట‌లు రేపిన స్నేహా రెడ్డి.. బ్యాక్ పోజుల‌తో బ‌న్నీ వైఫ్ ర‌చ్చ ర‌చ్చ‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినిమాలు చెయ్యకపోయినా సోషల్ మీడియా ద్వారా స్నేహా రెడ్డికి హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇప్ప‌టికే ఇన్‌స్టాలో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎనిమిది మిలియ‌న్లు దాటేసింది.

దానికి తోడు ఇటీవల స్నేహా రెడ్డి గ్లామర్ ఫోటోషాట్లతో త‌ర‌చూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. అందాల ఆరబోతలో బౌండరీలు చెరిపేస్తూ క్లీవేజ్ షో చేస్తోంది. తాజాగా శారీలో మరోసారి కుర్రకారు గుండెల్లో మంటలు రేపింది. ప్ర‌ముఖ స్టైలిష్ట్ ప్రీతమ్ జూవాల్కర్ డిజైన్ చేసిన గ్రీన్ క‌ల‌ర్ శారీలో స్నేహారెడ్డి అందంగా మెరిసింది.

డీప్ నెక్ జాకెట్ ధరించి బ్యాక్ పోజుల‌తో నెట్టింట ర‌చ్చ ర‌చ్చ చేసింది. ప్ర‌స్తుతం బ‌న్నీ వైఫ్ తాజా ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. స్నేహా ఫాలోవ‌ర్స్‌.. ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. అయితే కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం పెళ్లై, ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక కూడా ఈ ఎక్స్‌పోజింగ్ అవ‌స‌ర‌మా అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

Share post:

Latest