ఆ వ్య‌క్తితో 13 ఏళ్లుగా రిలేష‌న్‌.. కీర్తి సురేష్ ల‌వ్ స్టోరీలో షాకింగ్ ట్విస్ట్‌!?

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కోలీవుడ్ స్టార్ విజ‌య్ ద‌ళ‌ప‌తితో ప్రేమ‌లో ప‌డిందంటూ నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మొన్న మొన్నటి వరకు విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ తెగ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ ను పెళ్లి చేసుకునేందుకు విజ‌య్ సంగీత‌తో విడిపోబోతున్నార‌ని వార్త‌లు ఊపందుకున్నాయి.

కీర్తి సురేష్ తో రిలేష‌న్ వ‌ల్లే 22 ఏళ్ల త‌మ వివాహ బంధాన్ని విజ‌య్ తెగ‌దెంపులు చేసుకుంటున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్రకారం.. ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేద‌ట‌. విజ‌య్ తో కీర్తి సురేష్ ప్రేమ‌లో ప‌డ‌టం పూర్తిగా అవాస్త‌వ‌మ‌ట‌. కానీ, ఇక్క‌డే ఓ షాకింగ్ ట్విస్ట్ తెర‌పైకి వ‌చ్చింది.

కీర్తి సురేష్ ల‌వ్ లో ఉన్న‌ది నిజమే అట‌. అయితే విజ‌య్ తో మాత్రం కాద‌ని.. త‌న చిన్న‌నాటి స్నేహితుడితో అట‌. దాదాపు 13 ఏళ్ల‌గా కీర్తి సురేష్ త‌న చైల్డ్ హుడ్ ఫ్రెండ్ తో సీరియ‌స్ రిలేష‌న్ షిప్ లో ఉంద‌ట‌. స‌ద‌రు వ్య‌క్తి ఒక బ‌డా వ్యాపార‌వేత్త అని.. అత‌డికి కేర‌ళ‌లో ప‌లు రిసార్ట్స్ కూడా ఉన్నాయ‌ని అంటున్నారు. అయితే వీరిద్ద‌రూ ఇప్పుడే కాకుండా మ‌రో మూడు లేదా నాలుగేళ్ల త‌ర్వాత పెళ్లి చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకున్నారు. అందుకు ఇరు కుటుంబ‌స‌భ్యులు సైతం అంగీరం తెలిపార‌ని ఇన్‌సైడ్ టాక్‌.

Share post:

Latest