అలా అంటే బాల‌య్య ఊరుకుంటారా? అక్కినేని వ్యాఖ్య‌ల‌పై రోజా ఫైర్‌!

ఇటీవల జరిగిన `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. అక్కినేని అభిమానులు బాలయ్య వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ బాలయ్య వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఒక ప్రెస్ నోట్ ను విడుదల విడుదల చేశారు.

తాజాగా ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్, ప్రస్తుత ఏపీ మంత్రి ఆర్కే రోజా కూడా ఈ విషయంపై స్పందిస్తూ బాలయ్య పై ఫైర్ అయ్యింది. అక్కినేని నాగేశ్వరరావు పై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని రోజా పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలే ఎన్టీఆర్ పై ఎవరైనా చేస్తే బాలకృష్ణ ఊరుకుంటారా..? అంటూ ప్రశ్నించింది. దీంతో రోజా కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా, సినీ వర్గాల నుండి రాజకీయ వర్గాల వరకు బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలంటూ అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం బాలయ్య ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయనకు మద్దతుగా నిలబడుతున్నారు. మ‌రి ఈ విష‌యంపై బాల‌య్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Share post:

Latest