`వీర‌య్య‌` స‌క్సెస్ మీట్ లో రామ్ చ‌ర‌ణ్ వార్నింగ్.. టార్గెట్ ఆమెనా?

చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన `వాల్తేరు వీరయ్య` సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ నేపథ్యంలోనే మైత్రీవారు శనివారం సాయంత్రం హనుమకొండలో వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చరణ్ విచ్చేసి సందడి చేశారు. అలాగే ఈ ఈవెంట్లో చరణ్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ నాన్నగారు(చిరంజీవి) క్వైట్ గా ఉంటేనే ఇంతమంది వచ్చాం. అదే ఆయన గట్టిగా బిగించి మాట్లాడితే ఎలా ఉంటుందో.. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు అంటూ చరణ్ హెచ్చరికలు జారీ చేశారు.

చిరంజీవి గ‌రు సైలెంట్ గా ఉంటారేమో తాము ఉండ‌బోమ‌ని వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు చరణ్ వార్నింగ్ ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి ఆర్కే రాజా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్కే రోజాను టార్గెట్ చేస్తూ చ‌ర‌ణ్‌ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడని పలువురు మాట్లాడుకుంటున్నారు.

Share post:

Latest