నా చేతిలో 6 ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.. సైలెంట్‌గా ఉంటూ సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చిన చ‌ర‌ణ్‌!

రీసెంట్ గా `ఆర్ఆర్ఆర్‌` సినిమాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం జర‌గగా.. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, రాజ‌మౌళి, కీర‌వాణి స‌తీస‌మేతంగా హాజ‌రు అయ్యారు.

ఈ క్రమంలోనే వెరైటీ మ్యాగజైన్‌కు చెందిన మార్క్ మాల్కిన్‌ తో రామ్ చ‌ర‌ణ్ ముచ్చటించాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నారు. అలాగే ప్ర‌స్తుతం నా చేతిలో 6 ప్రాజెక్ట్‌లు ఉన్నాయ‌ని రామ్ చ‌ర‌ణ్ వెల్ల‌డించాడు. `2023లో నేను మూడు సినిమాలు ఒప్పుకున్నాను. వచ్చే ఏడాది కోసం మరో మూడు సినిమాలకు సైన్ చేశాను. దీంతో మొత్తం నా చేతిలో ఆరు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి’ అంటూ వెల్లడించాడు రామ్ చ‌ర‌ణ్‌.

దీంతో సొంత అభిమానులు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. సైలెంట్ గా ఉంటూనే ఇన్ని ప్రాజెక్ట్ లు లైన్ లో పెట్టి సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ఇటీవ‌ల `ఉప్పెన‌` ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే మరి వీటితో కలిపి చెప్పాడా లేక ఇవి కాకుండా 6 ప్రాజెక్టులకు సైన్ చేసానని చెప్పాడా అన్న‌ది తెలియాల్సి ఉంది.