రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. `ఆర్సీ 15` విడుద‌ల ఎప్పుడంటే?

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త‌న తదుపరి చిత్రాన్ని శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్‌ లో తెర‌కెకుతున్న 15వ‌ ప్రాజెక్ట్ ఇది. `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్ తో 2021లో ఈ మూవీని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు, శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులోకి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అంజ‌లి, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, న‌వీన్ చంద్ర‌, సునీల్, జ‌య‌రాయ్ తదితరులు కీలక పాత్రల‌ను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ యాబై శాతం షూటింగ్‌ కంప్లీట్ అయింది. మిగిలిన భాగాన్ని సైతం త్వ‌ర‌త్వరగా పూర్తి చేసే పనిలో మేక‌ర్స్ ఉన్నారు.

మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఎస్ థ‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించి రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఖుషీ అయితే గుడ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. తాజాగా ఈ సినిమా విడుదలపై మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంద‌ని అంటున్నారు.

Share post:

Latest