ఇదేం నిర్ణయం.. పాటలు, ఫైట్స్ లేకుండా వస్తున్న పవన్ కళ్యాణ్ మూవీ..??

పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి స్పెషల్‌గా ఇంట్రో అవసరం లేదు. సినీ పరిశ్రమలో ఎన్నో భారీ హిట్స్ సాధించిన పవన్ మ్యూజికల్ హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఖుషి, తమ్ముడు, తొలిప్రేమ నుంచి మొన్నీమధ్య వచ్చిన వకీల్ సాబ్ వరకు పవన్ సినిమాల్లో ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్స్ పాటలు ఉన్నాయి. ఇక ఫైట్స్ గురించి చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం ఆయన చేయబోయే ఒక సినిమాలో పాటలు, ఫైట్లు ఉండకపోవచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అనేది కేవలం కథపై మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తుందట.

కథ చెప్పేటప్పుడు ఎలాంటి ఫైట్స్, పాటలు ప్రేక్షకుడిని డిస్ట్రాక్ట్ చేయకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న వారికి సమయం, శ్రమను ఆదా చేయడానికి ఒకే ఒక షెడ్యూల్‌లో మూవీ షూటింగ్ పూర్తవుతుంది అని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం, ఈ మార్పు ఏ సినిమాలో ఫాలో అవుతారు ఇంకా తెలియ రాలేదు. అయితే, అభిమానులు సాధారణంగా పవన్ కళ్యాణ్ చిత్రాల నుంచి పాటలు, ఫైట్‌లను బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అతని చిత్రాలలో పాటలను ఆడియో కంపెనీలు అధిక మొత్తంలో చెల్లించి హక్కులను పొందుతాయంటే వాటికి ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంటే నిర్మాతలు దీనిని దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

ఈ ఊహాగానాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులను అలరించడంలో పవన్ కళ్యాణ్‌కు బలమైన ట్రాక్ రికార్డ్ ఉందని గుర్తుంచుకోవాలి. ఈ విషయం గురించి మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం. ఇకపోతే ప్రస్తుతం, అతను “హరి హర వీర మల్లు”, దర్శకులు సుజీత్, హరీష్ శంకర్‌లతో సహా పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

Share post:

Latest