పవన్ ‘వ్యూహం’..బాబుతోనే జగన్‌కు చెక్?

మొత్తానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుపై ఓ క్లారిటీ వచ్చింది. ఆ రెండు పార్టీలు కలిసే ముందుకెళ్లనున్నాయని ఇటీవల చంద్రబాబు-పవన్ భేటీతో కాస్త క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా పవన్ మాటలతో మరింత క్లారిటీ వచ్చింది. తాజాగా శ్రీకాకుళంలో యువశక్తి పేరిట భారీ సభ ఏర్పాటు చేసిన పవన్..సభ వేదికగా యువతరానికి, సామాన్య ప్రజానీకానికి అండగా ఉంటానని చెబుతూనే..జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే విధంగా మాట్లాడారు.

ఇక ఎప్పటిలాగానే తనపై విమర్శలు చేసే వైసీపీ నేతలని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక సీఎం జగన్‌ని టార్గెట్ చేసి మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ..మంత్రి అంబటి రాంబాబుని సంబరాల రాంబాబు అంటూ ఫైర్ అయ్యారు. రోజా, గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాద్ రావు…ఇలా అందరినీ గట్టిగా టార్గెట్ చేసి విమర్శించారు. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో వెళ్ళే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. మన గౌరవం తగ్గకుండా ఓ వ్యూహం ప్రకారం ముందుకెళ్తామని, గౌరవం లేదు అనుకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు.

అయితే దాదాపు పొత్తు ఫిక్స్ అని చెప్పవచ్చు. మీరు నమ్మకం ఇస్తే ఒంటరిగా వెళ్తానని, కానీ ఆ పరిస్తితి కనిపించడం లేదని,ఆల్రెడీ ఓసారి వెళ్ళి దెబ్బతిన్నామని, కాబట్టి పూర్తి బలం ఉందనుకుంటేనే ఒంటరి పోరుకు దిగుదామని, అంతవరకు వ్యూహం ప్రకారం ముందుకెళ్లడం అవసరమని చెప్పుకొచ్చారు. అంటే పొత్తు దాదాపు ఖరారు అయిందని చెప్పవచ్చు.

అదే సమయంలో గత ఎన్నికల్లో జనసేన 53 సీట్లలో ప్రభావితం చూపించిందని, ఆ సీట్లలో ఓట్లు చీల్చడం వల్లే జనసేన గెలిచిందని పవన్ చెప్పుకొచ్చారు. అంటే పరోక్షంగా 50 పైనే సీట్లు అడుగుతున్నట్లు కనిపిస్తున్నారు. చూడాలి మరి టీడీపీతో పొత్తులో జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయో.

Share post:

Latest