కేజిఎఫ్ 2 రికార్డులను బద్దలు కొట్టిన ఆ బాలీవుడ్ మూవీ..

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు ‘పఠాన్’ అనే సినిమా తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. దీనిని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్ లో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం విలన్ పాత్రలో యాక్ట్ చేశాడు. పఠాన్ భారతదేశంలో జనవరి 25 విడుదలైంది. ఇది IMAX, 4DX, స్టాండర్డ్ ఫార్మాట్‌లతో పాటు తమిళం, తెలుగులో డబ్బింగ్ వెర్షన్‌లలో విడుదలైంది.

కాగా తాజాగా పఠాన్ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద ఎత్తున వచ్చినట్లు తెలుస్తోంది. ఆ బుకింగ్స్ కేజిఎఫ్ సినిమా రికార్డింగ్స్ ని బ్రేక్ చేసినట్లు సమాచారం. కేజిఎఫ్ సినిమా మొదటిరోజు 5.15 లక్షల టికెట్ బుకింగ్స్ కలెక్ట్ చేయగా, పఠాన్ సినిమా మొదటిరోజు 5. 25 లక్షల రూపాయల టికెట్స్ తో కేజీఫ్ రికార్డులను బ్రేక్ చేసింది. నేషనల్ మీడియా రివ్యూస్ చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందని తెలుస్తోంది.

అన్ని మసాలా ఎలిమెంట్స్ తో వచ్చిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా దీనిని రివ్యూవర్లు పొగిడేస్తున్నారు. షారుక్ ఖాన్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఉద్యోగం నుంచి బయటికి నెట్టి వేయబడిన RAW ఫీల్డ్ ఆపరేటివ్ అయిన పఠాన్ తన పాత శత్రువైన జిమ్ అనే వ్యక్తిని ఈ లోకం నుంచి తొలగించడానికి మళ్లీ నియమించబడతాడు. రోగ్‌గా మారి మాజీ RAW ఏజెంట్ జిమ్ “అవుట్‌ఫిట్ X” అనే ప్రైవేట్ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తాడు. ఇది “రక్త్‌బీజ్” అనే ప్రాణాంతక వైరస్‌ను ఇండియా అంతటా వ్యాపింపజేయాలని యోచిస్తుంటుంది. వీరి కుట్రను ఆపేందుకు హీరో కృషి చేస్తాడు.

Share post:

Latest