స‌ర్‌ప్రైజ్‌.. రెండు భాగాలుగా రాబోతున్న `ఎన్టీఆర్ 30`!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా సినిమా తెర‌కెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్క‌బోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించ‌బోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ‌బోతున్నాడు. వ‌చ్చే నెల నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

ఏప్రిల్ 5, 2024లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ స‌ర్‌ప్రైజింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అదేంటంటే.. ఎన్టీఆర్ 30 రెండు భాగాలుగా రాబోతుంద‌ట‌. ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ కావ‌డంతో.. కొర‌టాల ఎన్టీఆర్ తో తీయ‌బోయే సినిమా కథపై గ‌ట్టిగానే కసరత్తు చేశాడు. ఎన్నో మార్పులు, చేర్పులు చేసి కథని అత్యంత శక్తివంతంగా మలిచాడట. ఈ కథ మొత్తం అండర్ వాటర్ నేపథ్యం లో సాగుతుంది.

NTR 30 To Get More Delay
NTR 30 To Get More Delay

అయితే కొర‌టాల రాసుకున్న క‌థ ఒక్క పార్ట్ లో చెప్ప‌డం చాలా క‌ష్ట‌మ‌ట‌. దీంతో సినిమాను రెండు పార్డులుగా తీయాల‌ని కొర‌టాల భావించ‌డం.. అందుకు ఎన్టీఆర్‌తో స‌హా నిర్మాత‌లు ఓకే చెప్ప‌డం జ‌రిగిపోయాయ‌ని అంటున్నారు. ఇక మొదటి భాగం 2024 లో, రెండవ భాగం 2025 వ సంవత్సరం లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట‌. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న సైతం రానుంద‌ని అంటున్నారు.

Share post:

Latest