నరేష్ మామూలు రొమాంటిక్ కాదు.. పవిత్రతో మరో హాట్ వీడియోను రిలీజ్ చేస్తాడట!

రీసెంట్‌గా తన మూడో భార్య రమ్య నుంచి విడాకులు తీసుకున్న టాలీవుడ్ యాక్టర్ నరేష్ ఇప్పుడు నాలుగో పెళ్లికి రెడీ అయిపోయాడు. తాను పవిత్టా లోకేష్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అంతేకాదు ఒక వీడియో రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు. ఈ వీడియోలో అతడు పవిత్రను లిప్ లాక్ చేసి అందరినీ నోరెళ్ళ బెట్టేలా చేశాడు. నరేష్ పవిత్రా లోకేష్‌తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ వాటన్నిటిని కొట్టి పారేస్తూ తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని నరేష్ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆమెను పెళ్లి చేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చి ఇంతకుముందు వచ్చిన అన్ని పుకార్లు నిజమేనని కుండ బద్దలు కొట్టాడు.

అయితే తాజాగా సినీ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం అతి త్వరలోనే వీరు మరో వీడియో విడుదల చేయొచ్చు. పెళ్లి పీటలను త్వరలోనే ఎక్కబోతున్న వీరు మరిన్ని వీడియోలు రిలీజ్ చేసి తాము ఎంత దగ్గరయ్యామో అందరికీ తెలియజేయునన్నారు. అలాగే తమ పెళ్లి అందరికీ తెలిసేలా తాము తమ వీడియోలు తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండ్ అయ్యేలా వీరు ప్లాన్ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వయసులో కుర్రాళ్ళ వలె వీరు రొమాన్స్ చేయడం వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. పెళ్లయితే వీరి కాంబో ఇక ప్రతి సినిమాలో చూడటం ఖాయమని మరికొందరు అంటున్నారు.