బాల‌య్య‌కు బిగ్ షాక్ ఇవ్వ‌బోతున్న నాగార్జున‌.. రోజురోజుకు ముదురుతున్న వివాదం!?

ఇటీవ‌ల `వీర సింహారెడ్డి` స‌క్సెస్ ఈవెన్ లో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ `అక్కినేని తొక్కినేని` అంటూ ఒక సంద‌ర్భంలో నోరు జారారు. బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యల‌కు అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. బాల‌య్య‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకేస్తున్నారు. ఇప్ప‌టికే అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ ప‌రోక్షంగా స్పందించారు.

`నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్‌వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం` అంటూ నాగ‌చైత‌న్య‌, అఖిల్ ట్వీట్ చేసి బాల‌య్య‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. అక్కినేని నాగేశ్వరరావు గారిని ఆయన కుటుంబాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్య‌లు చేసినందుకు బాల‌య్య క్ష‌మాప‌ణలు చెప్పాలంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా నాగార్జున సైతం బాల‌య్య‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యాడ‌ని ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. క్షమాపణలు చెప్పకపోతే బాల‌య్య‌ను అన్నపూర్ణ స్టూడియోస్ లోకి అడుగు పెట్ట‌కుండా చేయాల‌ని నాగ్ కఠినమైన నిర్ణయం తీసుకున్నార‌ట‌. బాలయ్య సంబంధించి ఏ చిన్న షూటింగ్ ని కూడా ఇక్కడ చేసుకునేందుకు అనుమ‌తులు ఇవ్వ‌కూడ‌ద‌ని నాగార్జున డిసైడ్ అయ్యాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.

Share post:

Latest