తల్లి కాబోతున్న మెగా కోడలు షాకింగ్ పోస్ట్..ఒక్కసారిగా ఎమోషనల్ చేసిన ఉపాసన..!

మెగా అభిమానులు గత 10 ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న న్యూస్ రానే వచ్చింది. మెగా కుటుంబంలోకి బుల్లి మెగాస్టార్ రాబోతున్నాడు అంటూ చిరంజీవి ఇచ్చిన అప్డేట్ మెగా అభిమానులకు సంబరాలు తీసుకొచ్చింది. మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు చిరు. కాగా అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఉపాసన- రామ్‌చరణ్ గురించే ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి.

కాగా తాజాగా మెగా కోడలు ఉపాసన ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. ఉపాసన నాయనమ్మ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఇక ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఓ మోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ఆమె ఆ పోస్టులో.. ‘నా జీవితంలో ఎంతో మంచి వ్యక్తిని కోల్పోయాను అంటూ బాధపడుతూ మీరు చివరి వరకు ఎంత కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారో మేము మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం’. ‘జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలా జీవించాలో తెలుసుకున్నాం’.

Upasana Konidela: ఉపాస‌న పుట్టినిల్లులో విషాదం.. నాకు జీవితాన్ని ఎలా  జీవించాలో నేర్పించిన నాన్నమ్మని కోల్పోయానన్న మెగా కోడలు | Upasana Konidela  Grand Motherm ...

‘మీ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను మీ దగ్గర నుంచి ఎలా ప్రేమానురాగాలు పొందాను.. ఆ అనుభూతులన్నిటిని నా పిల్లలకు అందేలా చూస్తానని మాట ఇస్తున్నాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఉపాసన పోస్ట్ చేసింది’. కాగా ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఉపాసన డెలివరీ అయితే చూడాలని ముని మనవడిని ఎత్తుకోవాలని ఉపాసన నాయనమ్మ ఎంతో ఆశపడ్డారట. కానీ ఆ కోరిక తీరకుండానే ఈ లోకం విడిచి వెళ్లిపోయారంటూ ఉపాసన కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. ఈ సమయంలో ఇది ఉపాసనకు ఎంతో బాధ కలిగించే వార్తనేే చెప్పాలి.