జనసేనలోకి కన్నా ఫిక్స్..సీటు పక్కా.!

జనసేనలోకి మాజీ మంత్రి, బి‌జే‌పి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చేరిక దాదాపు ఖాయమైందని ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయన బి‌జే‌పిని వీడి జనసేనలో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తోంది. అయితే బి‌జే‌పి-జనసేన పొత్తులో ఉన్నాయి..అలాంటప్పుడు కన్నా జంపింగ్ ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. కానీ ఈ మధ్య కన్నా..సోము వీర్రాజు వైఖరిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు..ఆయనపై తీవ్ర విమర్శలు కూడా చేశారు.

ఇదే సమయంలో సోము సైతం…కన్నాపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. తనపై చేసిన విమర్శలపై బి‌జే‌పి అధిష్టానానికి ఫిర్యాదు చేశారని కూడా సమాచారం. సరే ఏదేమైనా గాని కన్నా-సోములకు పడటం లేదు. ఇదే నేపథ్యంలో భీమవరంలో రాష్ట్ర స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పొత్తుల గురించి కాస్త క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జనసేన ఎలాగో టీడీపీకి దగ్గరైంది. బి‌జే‌పి మాత్రం టి‌డి‌పితో పొత్తుకు ఒప్పుకోవడం లేదు. కానీ టీడీపీతో పొత్తు ఉంటేనే..నాలుగు సీట్లు గెలవగలమని కొందరు బి‌జే‌పి నేతలు భావిస్తున్నారు.

రాష్ట్ర స్థాయి సమావేశాల్లో అదే అంశాన్ని కొందరు నేతలు చెప్పే ఛాన్స్ ఉంది..కానీ కొందరు మాత్రం టి‌డి‌పితో పొత్తుకు ఒప్పుకోవడం లేదు. ఒకవేళ టి‌డి‌పితో పొత్తు ఒప్పుకోకపోతే..జనసేన మాత్రం బి‌జే‌పిని వదిలి..టి‌డి‌పితో కలిసి ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. అదే సమయంలో బి‌జే‌పిలోని కొందరు నేతలు టీడీపీ లేదా జనసేనల్లోకి జంప్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఈ క్రమంలోనే కన్నా సైతం జనసేనలోకి వెళ్లడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ఇక టీడీపీతో పొత్తు ఉంటే..ఉమ్మడి గుంటూరులో జనసేనకు సత్తెనపల్లి, తెనాలి, గుంటూరు వెస్ట్ లేదా ఈస్ట్ సీట్లు దక్కుతాయని సమాచారం. ఇక కన్నా సత్తెనపల్లి లేదా గుంటూరు వెస్ట్ లో పోటీ చేస్తారని తెలుస్తోంది. చూడాలి కన్నా బి‌జే‌పిని వీడతారో లేదో.

Share post:

Latest