చివరి రోజుల్లో ఐరన్ లెంగ్ శాస్త్రి మరణం అంత దారుణంగా ఉందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి నటులలో ఘనపూడి విశ్వనాథ శాస్త్రి కూడా పలు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు. అయితే ఈ పేరు వినగానే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఐరన్ లెగ్ శాస్త్రి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. తెలుగు ప్రేక్షకులకు అలరించిన ఈ నటుడు దాదాపు 150 సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండేవారు. ముఖ్యంగా డైరెక్టర్ ఈ వివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అప్పుల అప్పారావు సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఐరన్ లెగ్ శాస్త్రి.

Comedy Kings - Marriage Broker Ironleg Sastri - Rajendraprasad, Gundu  Hanumantha Rao - YouTube

ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించారు. అలా ప్రేమఖైదీ పేకాట, పాపారాయుడు, ఆవిడ మా ఆవిడ వంటి చిత్రాలలో నటించి నటుడుగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎక్కువగా బ్రహ్మానందం అసిస్టెంట్ గా నటించి మంచి విజయాలను అందుకున్నారు ఐరన్ లెగ్ శాస్త్రి. అప్పట్లో ఐరన్ లెగ్ శాస్త్రి, బ్రహ్మానందం కాంబినేషన్ కు మంచి డిమాండ్ ఉండేది. ఇక సినిమాలలోకి అడుగుపెట్టిన తర్వాత తన వృత్తిపరమైన పురోహిత్యాన్ని కూడా వదిలేశారట. అయితే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో మద్యానికి కూడా బానిసైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు తగ్గడం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవ్వడం తన పాత వృత్తి పురోహిత్యాన్ని వైపు తిరిగి వెళ్లాలనుకున్న.. సినిమాల్లో ఐరన్ లెగ్ శాస్త్రి అని పేరు పడడంతో ఆ పేరు తన వ్యక్తిగత జీవితం పైన కూడా ప్రభావం పడిందట. దీంతో కొంతమంది ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వారు ఆర్థిక సహాయం చేశారని సమాచారం.ఆరోగ్యం పూర్తిగా పాడే పోవడంతో తన సొంత ఊరు తాడేపల్లిగూడెంలోకి వెళ్లిపోయారు. చివరికి బరువు ఎక్కువగా పెరిగిపోవడంతో అనారోగ్య సమస్యలతో 2006 జూన్ 19న గుండెపోటుతో మరణించినట్లుగా తెలుస్తోంది. చివరికి ఒక రిక్షాలో డెడ్ బాడీ ఉండడం చూసి ఐరన్ లెగ్ శాస్త్రి కుటుంబ సభ్యులు చాలా కన్నీరు మున్నారయ్యారట .ఈ విషయాన్ని కుమారుడు ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.