తమ్ముడు సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

పవన్ కళ్యాణ్ కు క్రేజీ తెచ్చి పెట్టిన చిత్రాలలో తమ్ముడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇందులోని పాటలు కూడా బాగానే ఫేమస్ అయ్యాయి ఇందులో ఏ పిల్ల నీ పేరు లవ్లీ అనే సాంగ్లో కనిపించిన హీరోయిన్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. ఈమె పేరు అదితి గోవిత్రికర్. పవన్ కళ్యాణ్ సరసన మొదటి చిత్రంలోని నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

Aditi Govitrikar Height, Age, Boyfriend, Husband, Children, Family, Biography & More » StarsUnfolded
ఇక తర్వాత 2002లో సోచ్ అనే చిత్రంతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 16 డిసెంబర్, బాజ్ ,ధనాధన్, ప్రైవేటు తదితర చిత్రాలలో నటించింది అయితే ఇదేమి కూడా ఈమెకు మంచి క్రేజ్ తెచ్చి పెట్టలేకపోయాయి. దీంతో సిల్వర్ స్క్రీన్ పైన మాత్రమే కాదు బుల్లితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉంది అదితి గోవిత్రికర్. పలు హిందీ సీరియల్స్ లో తోపాటు పలు వెబ్ సిరీస్లలో కూడా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే..

Dr. Aditi Govitrikar - YouTube
1998లోనే ఈమె దాపూడి బోహ్రా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ప్రస్తుతం ఇద్దరు సంతానం పలు వ్యక్తి కారణాల చేత 2007లో వీరిద్దరు విడిపోయినట్లు సమాచారం దీంతో పిల్లలతో కలిసి ఈమె ముంబైలో తన సోదరితో కలిసి నివసిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇటీవలే సైకాలజీలో తన మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది అదితి గోవిత్రికర్. ప్రస్తుతం లండన్ లోని హార్వార్డ్ యూనివర్సిటీలో ఏమే సైకాలజీలో రెండవ డిగ్రీ మాస్టర్ చదువుతున్నట్లు తెలుస్తోంది అటు మోడలింగ్ ఇటు డాక్టర్ డిగ్రీ రెండు కూడా ఇమే హాండిల్ చేస్తూ ముందుకు వెళ్తోంది.