Dhasara: వామ్మో కీర్తి సురేష్ కూడా గిఫ్ట్ గా బంగారు కానుకలు..!!

మహానటి సినిమాతో టాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఒక పక్క స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే మరొకపక్క లేడి ఓరియంటెడ్ చిత్రాలలో, కమర్షియల్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ చేతిలో రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తోంది. చిరంజీవి చెల్లెలుగా భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇక అలాగే నాచురల్ స్టార్ నానితో కలిసి దసరా అనే సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

బంగారు మనసు చాటుకున్న కీర్తి సురేష్.. లక్షలు ఖర్చు చేసి 'దసరా' యూనిట్ కు  బహుమతులు?

ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్నది. దీంతో కీర్తి సురేష్ చిత్ర బృందానికి కానుకలు ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ సినిమా కోసం పనిచేసిన 130 మందికి రెండు గ్రాముల బంగారు కాయిన్స్ ని బహుమతిగా ఇచ్చిందట. ఇందుకోసం కీర్తి సురేష్ దాదాపుగా 13 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని బహుమతులు అందుకున్న కొంతమంది సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ కీర్తి సురేష్ కు థాంక్స్ చెబుతూ పలు రకాలుగా పోస్టులు షేర్ చేస్తున్నారు.

Keerthy Suresh Golden Gift - Filmify Telugu

ప్రస్తుతం ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ సినిమాతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పరిచయం కాబోతున్నారు సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో నాని మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇక అలాగే కీలకమైన పాత్రలో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, సముద్రఖని ,సాయికుమార్, మీరాజాస్మిన్, పూర్ణ తదితరులు కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

https://twitter.com/MeenaJo7/status/1616319144978419712?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1616319144978419712%7Ctwgr%5Ee5a2a6de2a14b6a500502e9454daa3cdbaf2d3b5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Fkeerthy-suresh-gave-gold-gifts-for-dussehra-unit-568755.html