బాబు గెలుపుపై ధర్మాన కాన్ఫిడెన్స్..కొత్త మెలికతో.!

నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని అటు అధికార వైసీపీ,ఇటు ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఏ విషయంలోనూ తగ్గకుండా జగన్, చంద్రబాబు పోటాపోటిగా రాజకీయం చేస్తున్నారు. ఎవరికి వారే అధికారం తమదంటే తమదని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది ఇప్పుడే చెప్పలేని పరిస్తితి. అసలు ప్రజల నాడి అంతు చిక్కకుండా ఉంది.

అయితే ప్రజా నాడి ఎలా ఉన్నా ప్రధాన పార్టీల రాజకీయ వ్యూహాలు సరికొత్తగా ఉంటున్నాయి…ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకొస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సరికొత్త డిమాండ్‌తో రాజకీయం చేస్తున్నారు. విశాఖని రాజధానిగా చేయాలని మొదట నుంచి డిమాండ్ చేస్తున్న ధర్మాన..విశాఖని రాజధానిగా చేయకపోతే ఉత్తరాంధ్రని సెపరేట్ గా రాష్ట్రం చేసి..విశాఖని రాజధాని చేసుకుంటామని అంటున్నారు. ఇక విశాఖ రాజధాని కాకుండా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అడ్డుకుంటున్నారని, అధికారంలో ఉన్న ధర్మాన అంటున్నారు.

అయితే అనేక ఏళ్ళు ధర్మాన మంత్రిగా చేశారు..ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు…అయినా ఉత్తరాంధ్ర వెనుకబడే ఉందంటే అందులో ధర్మాన వంతు కూడా ఉందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఆయనే డిమాండ్ చేసేది ఏంటంటే..ఉత్తరాంధ్రని సెపరేట్ రాష్ట్రంగా చేయాలని కోరుతున్నారు. పైగా జగన్‌కు షాక్ ఇస్తూ..చంద్రబాబు అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారని, అందులో తమకు అభ్యంతరం లేదని, కానీ   విశాఖ ప్రత్యేక రాష్ట్రం కావలసిందేనని డిమాండ్ చేశారు.

అంటే ఇక్కడ ధర్మాన లాజిక్ ఏంటంటే..బాబుకు నెక్స్ట్ అధికారం వస్తుందనే కోణంలో మాట్లాడినట్లు తెలుస్తోంది..అలాగే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారని, కాబట్టి తమకు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ధర్మాన డిమాండ్ నెరవేరుతుందో లేదో చూడాలి.

Share post:

Latest