కొరటాల శివ రూమర్స్ పై స్పందించిన చిరు..!!

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రోజున వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా విడుదల సందర్భంగా పలు ప్రమోషన్స్లో ఈవెంట్లలో దర్శకుల గురించి డైరెక్టర్లు చేయవలసిన చేయకూడని పనుల గురించి చిరంజీవి పదేపదే వివరించారు. అంతేకాకుండా వాల్తేర్ వీరయ్య సినిమాని దర్శకత్వం వహించిన డైరెక్టర్ బాబి పనితనాన్ని కూడా మెచ్చుకుంటూ పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు.

Chiranjeevi Is Still Serious On Koratala Siva And Blaming Only The Director For The Result - TrackTollywood

ఇక బాబి తండ్రి చనిపోయిన మూడవరోజు షూటింగ్ కి వచ్చారని చెప్పడం జరిగింది.ఆచార్య రిలీజ్ తర్వాత సినిమా ఈవెంట్లలో పాల్గొన్న చిరు దర్శకులు డైలాగులు సీన్లు రాస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని కూడా కామెంట్లు చేశారు. ఇవన్నీ డైరెక్టర్ కొలటాల శివ ను ఉద్దేశిస్తే చిరంజీవి అన్నారంటు సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య సినిమా డిజాస్టర్ కావడానికి డైరెక్టర్ కొరటాల శివ కూడా కారణమని తను సినిమా కథనాల పైన దృష్టి పెట్టకుండా నిర్మాణం బిజినెస్ పైన దృష్టి పెట్టడం వల్లే సినిమా డిజాస్టర్ గా మిగిలిందని వార్తలు వినిపించాయి.

ఇదంతా ఇలా ఉంటే కొరటాలని ఉద్దేశించి తాను కామెంట్లు చేయలేదని వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్లలో చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.ఇండస్ట్రీ బాగుండాలంటే ప్రతి దర్శకుడు కూడా సెట్స్ కు వెళ్లే ముందు ప్రతి అంశాన్ని పేపర్ పైన వర్కౌట్ చేయాలని తెలిపారు. నాలుగు గంటల నిడివితో సినిమా షూటింగ్ చేసి ఆ తర్వాత ఒక గంట లెంత్ను ట్రిమ్ చేయడం కంటే పర్ఫెక్ట్ గా మూడు గంటల లోపే షూటింగ్ చేస్తే పక్కా స్క్రీన్ ప్లే తో రూపొందించడం ఉత్తమం అని తెలిపారు చిరంజీవి. అయితే ఈ మాటలు ఎవరిని ఉద్దేశించినవి కావాలని ఎవరిని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చిరంజీవి తెలిపారు.