పులిపిర్లతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..!

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్య, సౌందర్య విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల కాలంలో చాలామంది చర్మంపై పులిపిర్లతో బాధపడుతూ ఉంటారు వీటివల్ల అంద విహీనంగా మారడమే కాకుండా అందాన్ని కూడా కోల్పోతారు.అయితే ఈ పులిపిర్లను తగ్గించడానికి సహజ చిట్కా.. సపోటా పండు.. సపోటా పండు ఆరోగ్యానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందంటే ఇక వైద్యుడు దగ్గర కూడా వెళ్లాల్సిన పని ఉండదు.

అయితే ఈ సపోటా పండు పులిపిర్లు నయం చేయడంలో ఎలా సహాయపడుతుంది అంటే పచ్చి సపోటా పండు నుంచి వచ్చే పాలను పులిపిర్లు ఉన్నచోట అప్లై చేసినట్లయితే క్రమంగా అవి రాలిపోతాయి. పైగా ఎటువంటి మచ్చలు కూడా ఏర్పడవు. సపోటా ఒక్క పులిపిర్లను నయం చేయడమే మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం మరియు ఐరన్ శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తాయి. ఎముకలు పెలుసుబారే సమస్యను తగ్గిస్తాయి. ఎముకల గట్టితనానికి సపోటా ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాకుండా సపోటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు శరీరాన్ని కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతాయి.

సపోటా యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. అందువల్ల ఇది పేగులలో ఏర్పడే సమస్యలను తగ్గిస్తుంది.కడుపులో ఏర్పడే పుండ్లు మరియు అల్సర్లను కూడా నివారిస్తుంది. సపోట అధిక శక్తిని ఇచ్చే గ్లూకోజ్ ను కలిగి ఉంది. ఇది మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. సపోటా పండు మన కంటి సమస్యలను దూరం చేసే విటమిన్ ఎ ను కలిగి ఉంది. తరచూ సపోటా పండు తీసుకోవడం వలన కంటి సమస్యలు ఉన్నవారు మెరుగైన ఫలితాలను పొందవచ్చు.అంతేకాకుండా కిడ్నీలో ఉండే రాళ్లను తొలగించేందుకు సహాయపడుతుంది. ఒత్తిడిని తొలగిస్తుంది. దంత క్షయాన్ని నివారిస్తుంది.