తనని కూడా కోరిక తీర్చమన్నారు.. అమ్రిష్ పురి మనవడు..!!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ల పైన లైంగిక వేధింపుల గురించి మీటు ఉద్యమం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పేరుతో కొంతమంది హీరోయిన్లను వేధిస్తూ ఉన్నారని అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం కమిట్మెంట్ అనే పదానికి ఓకే చెప్పడంతో పలు అవకాశాలు కూడా సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం వీటిని అసలు ఒప్పుకోరు సినిమాలో ఎలాంటి సన్నివేశాలు చేయడానికి అయినా సిద్ధమే కానీ ఆఫ్ స్క్రీన్ మీద మాత్రం ఎవరికీ కమిట్మెంట్ ఇచ్చేది లేదు అంటూ తెలియజేసిన వారు చాలామందే ఉన్నారు.

Amrish Puri's Grandson Vardhan Puri: "Still So Difficult For Me To Separate  The Grandfather From The Superstar"
అయితే అమ్మాయి అనే విషయానికి ఇదొక కామన్ పాయింట్ గా అయిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పై గడిచిన కొద్ది రోజులుగా పోరాడుతూనే ఉంది. ఏమైందో ఏమో తెలియదు కానీ శ్రీరెడ్డి తో పాటు,వెనుక నిలబడ్డ అందరూ కూడా సైలెంట్ గా మారిపోయారు. అయితే బాలీవుడ్లో మాత్రం క్యాస్టింగ్ కోచ్ బాధితులలో అబ్బాయిలు కూడా ఉండడం అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది. గతంలో చాలామంది నటులు తాము క్యాస్టింగ్ కౌచ్ వేదికలకు గురయ్యామని తెలిపారు.

మగవాళ్లే తమ కోరికలు తీర్చాలని తమను అడుగుతున్నారని కొంతమంది నటులు తెలుపుతున్నారు తాజాగా అలాంటి ఆరోపణలు వర్ధన్ పురి కూడా చేస్తున్నారు. ఒకప్పటి విలక్షణమైన నటుడు అమ్రిష్ పురి మనవడు బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అయితే అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో తనని లైంగిక కోరికలు తీర్చమని అవకాశాలు ఇస్తామని ప్రపోజల్ పెట్టారట.. అలాంటి ప్రపోజల్ పెట్టిన వారిలో మగవారు కూడా ఉన్నారని తెలిపారు. అలాంటి వారికి నిర్మూమాటంగా నో చెప్పేసానని తెలిపారు వర్ధన్ పూరి. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ లో అమ్మాయిలే కాకుండా అబ్బాయిలను కూడా వేధించేవారు ఉన్నారా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.