నటుడు వడివేలు ఇంట తీవ్ర విషాదం…!!

ప్రముఖ హాస్య నటులలో వడివేలు కూడా ఒకరిని చెప్పవచ్చు. పేరుకే తమిళనాడు అయినప్పటికీ తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ గా పేరు సంపాదించారు. అయితే పలు కారణాల వల్ల వడివేలుపై తమిళ ఇండస్ట్రీలో నిషేధం విధించడం జరిగింది. దీంతో ఆయన కొన్నేళ్లపాటు సినిమాలలో నటించలేదు. గడిచిన కొన్నాళ్లు ముందే రీ ఎంట్రి ఇచ్చి ఆయన పలు సినిమాలలో చేస్తూ బిజీగా ఉన్నారు. గత ఏడాది చివర్లో నాయి శేఖర్ రిటర్న్స్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ప్రస్తుతం చంద్రముఖి -2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Tamil Actor Vadivelu's Mother Dies, Aged 87, Due To Age-Related Ailments

ఇక తాజాగా ఈయన ఇంట్లో విషాదం చోటు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే వడివేలు తల్లి పాప పలు అనారోగ్య సమస్యలతో మరణించినట్లుగా తెలుస్తోంది.ఆమె వయసు 87 సంవత్సరాలు మధురై దగ్గరలోని సొంతూరు విరాగనూర్ లో ఉంటున్న ఈమె గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి రోజున రాత్రి పరిస్థితి విషమించడం మరణించినట్లుగా తెలుస్తోంది. దీంతో వడివేలు షూటింగ్లో ఉన్న సమయంలో వాటన్నిటిని ఆపివేసి తక్షణమే ఊరికి బయలుదేరి వెళ్లిపోయినట్లుగా సమాచారం.

ఇక వడివేలు తల్లి చనిపోవడం పై పలువురు నేటిజెన్లు సైతం సంతాపం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్ట్ చేస్తూ కొంతమంది యాక్టర్స్ ఆమె అంతక్రియలకు హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వడివేలు అభిమానులు తీవ్రమైన నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.