నటుడు విశాల్ పెళ్లి ఇప్పట్లో అయ్యేనా..?

హీరో విశాల్ పెళ్లి విషయం ఎప్పుడూ కూడా ప్రశ్నార్థకంగానే మారుతోంది. ఇటీవల ఒక అందమైన కథానాయకను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు కూడా బాగా వినిపించాయి. ఒక గతంలో కూడా హీరో విశాల్ ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత బడా ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరగగా..అది కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఇలా ఎన్నో సార్లు విశాల్ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో విశాల్ అభిమానులు విశాల్ ఇప్పట్లో వివాహం చేసుకుంటారా లేదా అనే సందేహం కూడా కలుగుతోంది.

Tamil actor Vishal will get married on THIS one condition | PINKVILLAతెలుగు, తమిళ భాషలలో మోస్ట్ యాక్షన్ హీరోగా పేరు పొందారు విశాల్. విశాల్ చిత్రాలలో ఫైట్ సీన్స్ , ఎక్కువగా రిస్కులు వంటివి తీసుకుంటూ ఉంటారు. విశాల్ నటించిన లాఠీ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇందులో ఇప్పటికే మూడుసార్లు సినిమా షూటింగ్లో గాయాలపాలయ్యారు విశాల్. ఇక రియల్ లైఫ్ లో కూడా విశాల్ నడిగరసంఘం మాజీ అధ్యక్షుడు నటుడు శరత్ కుమార్ తో కూడా బిగ్ ఫైట్ జరిగింది. అప్పట్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఆ తర్వాత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి హోదాలో నడిగర్ సంఘం భవనం పూర్తయిన తర్వాతే వివాహం చేసుకుంటానని ఎన్నోసార్లు తెలియజేశారు విశాల్. ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు కరోనా వల్ల భవన నిర్మాణం ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక 2019 విశాల్ ప్రేమలో పడ్డారు. ఆంధ్రాకు చెందిన నటి అనిషా అల్లా రెడ్డితో నిశ్చితార్థం కూడా జరిగింది కానీ ఆరు నెలల తర్వాత కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారు. అయితే విశాల్ త్వరలోనే తను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నానని హింట్ కూడా ఇచ్చారు. మరి భవన నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుంది విశాల్ వివాహం ఎప్పుడు వివాహం చేసుకుంటాడు అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.