ముఖచిత్రం ట్రైలర్ తో అదరగొడుతున్న విశ్వక్ సేన్..!!

వికాస్ వశిష్ట, 30 వెడ్స్ 21 చైతన్య రావు, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రలో నటిస్తున్న మిస్టారికల్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ముఖచిత్రం. ఇందులో యంగ్ హీరో విశ్వక్ సేన్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే విడుదల చేసిన సీన్ క్యారెక్టర్ కు సంబంధించి చిన్న గ్లింప్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ట్రైలర్ ను ఈ రోజున విడుదల చిత్ర బృందం విడుదల చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే ఒక మహిళకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత ప్లాస్టిక్ సర్జన్ తీవ్ర గందరగోళంలో కూరుకుపోయిన కథ అంశంతో ఈ సినిమాని తెరకెక్కించినట్లు ట్రైలర్లు క్లియర్ గా కనిపిస్తోంది. అటు తరువాత ఆ సర్జన్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశంతో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ఇచ్చినట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సర్జరీ చేయించుకున్న మహిళగా ప్రియా వడ్లమాని.. సర్జంగ వికాస్ వశిష్ స్నేహితుడిగా చైతన్య రావు కనిపించారు. ఇక్కడ లాయర్ పాత్రలో విశ్వక్ సేన్ నటించడం జరిగింది. మొదటిసారిగా నల్లకోటు ధరించి విశ్వక్ బాగా ఆకట్టుకుంటున్నాడు.

ట్రైలర్ చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా చాలా థ్రిల్లింగ్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత అదిరిపోయేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని గంగాధర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక ఈ చిత్రానికి కథ కలర్ ఫోటో ఫ్రేమ్ సందీప్ రాజా కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. ముఖచిత్రం సినిమా డిసెంబర్ 9వ తేదీన విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.