సీక్రెట్ గా వివాహం చేసుకొని షాకిచ్చిన బుల్లితెర నటి..!!

బుల్లితెర ప్రేక్షకులను నటి దేవలినా బట్ట చార్జి బాగా సుపరిచితమే..దేవలినా బట్ట చార్జి అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కోడలా కోడలా కొడుకు పెళ్ళామా సీరియల్ లో హీరోయిన్ అంటే చాలామంది గుర్తుపడతారు. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది దేవలినా . ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే తాజాగా ఇమే సీక్రెట్ గా వివాహం చేసుకొని ఒకసారిగా అభిమానులకు ఫోటోలు షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Did 'Bigg Boss' fame Devoleena Bhattacharjee just get married? Photos have  Netizens confused | Entertainment

తన ప్రియుడితో కలిసి మూడు ముళ్ళు వేయించుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది దేవలినా.ఈమె వివాహం లోనవాలాలో వివాహ వేడుకలకు ఇరువురు కుటుంబాలు, దగ్గర బంధువులు మాత్రమే హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ పెళ్లికి దేవలినా స్నేహితులు విశాల్ సింగ్, రష్మీ సింగ్, భావిని పురోహిత్ దంపతులు హాజరయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో దేవాలీనాకి షాది అనే ఒక హ్యాష్ ట్యాగ్ తో ట్రెండీగా మారుతోంది.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలను ఎక్కువగా విశాల్ సింగ్ వధువు పక్కన ఉండడంతో వీరిద్దరూ వివాహం చేసుకున్నారేమో అని చాలామంది పొరబడుతున్నారు. కానీ ఇది నిజం కాదు విశాల్ ఇక్కడ స్నేహితుడు మాత్రమే ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజెన్స్ ఇది నిజమైన పెళ్లా లేకపోతే ఏదైనా మ్యాగజైన్ ఆల్బమ్ కోసం ఇలా రెడీ అయ్యావా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దేవలినా కేవలం హల్దీ మెహందీ ఫోటోలను మాత్రమే షేర్ చేసింది వరుడు ఫోటోని మాత్రం చూపించలేదు. కేవలం ఒక్క ఫోటోలో భర్త చేయని పట్టుకొని ఉంది. కానీ ఈమె జిమ్ ట్రైనర్ శాన్వాద్ షైఖ్ ను వివాహం చేసుకున్నట్లుగా వార్త వినిపిస్తున్నాయి. మరి అసలు విషయాన్ని ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)