నాచురల్ బ్యూటీ సైలెంట్ గా ఉండడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హైలీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరుపొందింది సాయి పల్లవి. ఫిదా చిత్రంతో మొదటిసారిగా తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తెలుగు, తమిళ్ భాషలలో కూడా విపరీతమైన క్రేజ్ ను సంపాదించింది. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంది. నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమాతో నానితో శ్యామ్ సింగరాయ్ ఇలాంటి సినిమాలతో వరుసగా విజయాలను అందుకుంది. కానీ ఈ ఏడాది మాత్రం అంతగా సాయి పల్లకి కలిసి రాలేదని చెప్పవచ్చు.

I See Comfort Over Everything: Gargi Actress Sai Pallavi On Leading A  Simple Lifestyle

భారీ అంచనాల మధ్య విడుదలైన విరాటపర్వం సినిమా నిరాశనపరిచింది.ఆ తరువాత లేడీ ఓరియంటెడ్ గా నటించిన గార్గీ చిత్రం విడుదలై ప్రశంసలు అందించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఈ చిత్రాలు విడుదల ఇప్పటికి ఎన్నో నెలలు కావస్తున్న ఇప్పటివరకు సాయి పల్లవి తదుపరి చిత్రం గురించి ఎలాంటి వార్త వినిపించలేదు. సినిమాల సమయంలోనే దికాశ్మీర్ ఫైల్ సినిమాపై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీసాయి. ఇక తనమీద కొంతమంది రాజకీయవేత్తలు కూడా కేసు నమోదు చేయించడంతో అప్పట్లో ఈ విషయం పెను సంచలనంగా మారింది.

దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది ఇక మీదట సినిమాలు చేయదని.. త్వరలోనే ఒక హాస్పిటల్ ని ప్రారంభించబోతోందని వార్తలు వినిపించాయి. దీంతో కొత్త ప్రాజెక్టులను అంగీకరించలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమాలో నటించేందుకు అంగీకరించింది అనే వార్తలు వైరల్ గా మారాయి. కానీ ఈ విషయంపై సాయి పల్లవి కానీ తన టీమ్ కానీ ఏ విధంగా స్పందించలేదు. కానీ ఇతర హీరోయిన్ల టీమ్ మొత్తం వారి విషయాలపై స్పందిస్తోంది కానీ సాయి పల్లవి టీమ్ మాత్రం మౌనం పాటించడంతో అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు.

Share post:

Latest