తన పెళ్లి ఎన్నిసార్లు చేస్తారని ఫైర్ అవుతున్న తమన్నా..!!

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ తమన్నా స్టార్ హీరోయిన్లలో ఒకరిని చెప్పవచ్చు. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ ,బాలీవుడ్ వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది. తమన్నా నటిగానే కాకుండా ఒక మోడల్, నృత్యకారునిగా కూడా పేరుపొందింది.తమన్నా అందంతో, అభిమానులు ముద్దుగా ఇమేను మిల్కీ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు. మొదట హ్యాపీ డేస్ సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో కూడా నటించింది.

Tamannaah Bhatia: Definitely think about it after two years .. MilkyBeauty  who made interesting comments .. | Actress tamanna bhatia about her  marriage | PiPa News

నటించిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన తామన్నా టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా తండ్రి కొడుకులతో నటించిన ఘనతను కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యకాలంలో హీరోయిన్ల హవా ఎక్కువగా ఉండడంతో సీనియర్ హీరోయిన్లకు పలు అవకాశాలు రావడంలేదని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్ రోజురోజుకి కొత్త దనానికి అలవాటు పడడంతో పాత హీరోయిన్ లను కూడా పక్కన పెట్టేస్తున్నారు. తాజాగా ఈ రోజున గుర్తుందా శీతాకాలం సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది తమన్నా.

ఈ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఈమె మాట్లాడుతూ నాకు జోడిగా సత్యదేవ్ కరెక్ట్ గా బాగా సెట్ అవుతారని పించింది అందుకే ఆయన్ని ఈ సినిమాలో పెట్టించాను.అంతేకాకుండా ఈమధ్య సోషల్ మీడియాలో కూడా తన పెళ్లికి సంబంధించిన అనేక రకాల వార్తలు వస్తున్నాయి కొంతమంది బిజినెస్ మ్యాన్ తో, మరికొంతమంది డాక్టర్ తో తన పెళ్లి తనకు తెలియకుండా అని ఎన్నోసార్లు చేశారని తెలియజేసింది. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని తెలియజేసింది. ఇక తర్వాత సినిమాలు మానేసి ప్రొడ్యూసర్ గా మారతానని తెలియజేసింది.

Share post:

Latest