సీరియల్ నటీమణులు వంటలక్క, రుక్మిణి, గృహలక్ష్మిలో ఎక్కువ పెయిడ్ రెమ్యూనరేషన్ ఎవరిదో తెలుసా?

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో సినిమాలకు మల్లే బుల్లితెరపై వచ్చే సీరియల్స్ కి కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమను చాలా మంది సీరియల్ స్టార్స్ సాధించుకున్నారు. ఇక్కడ మొదటగా వంటలక్క, గృహలక్మీలాంటి స్టార్స్ గురించి చెప్పుకోవాలి. వారి సీరియల్స్ క్రమం తప్పకుండా తెలుగు మహిళలు చూస్తూ వుంటారు. ఆ లిస్టులో మగమహారాజులు కూడా అనేకమంది వున్నారు. అయితే వీరు రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో మీరు ఎపుడైనా ఊహించారా?

ప్రస్తుతం ఇక్కడ మోస్ట్ పాపులర్ సీరియల్ స్టార్ హీరోయిన్ గా కార్తీక దీపం సీరియల్ ఫేం వంటలక్క ఓ వెలుగు వెలుగుతోంది. తెలుగులో బాగా పాపులర్ అయిన ఈ అమ్మాయిది కేరళ. వంటలక్క.. లేదా దీపగా బాగా అందులో బాగా పేరు తెచ్చుకుంది. ఆమె అసలు పేరు ప్రేమీవిశ్వనాథ్ అని మీలో ఎంతమందికి తెలుసు? ఈ బుల్లితెర స్టార్ రోజుకు 30 వేల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటందని మీరు ఊహించారా?

ఇక ఆమె తరువాత గృహలక్ష్మీ సీరియల్ లీడ్ క్యారెక్టర్ ‘తులసీ’ పాత్ర బాగా పాపులర్ అయ్యింది. ఆమెపేరు కస్తూరీ. ఆమె ఒకప్పుడు హీరోయిన్ గా కూడా నటించిందని మీకు తెలుసా? అన్నమయ్య లాంటి సినిమాలో హీరోయిన్ గా సందడి చేసిన కస్తూరి.. నేడు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తోంది. ఇక ఈమె రోజుకు 35 వేలు తీసుకుంటుందని భోగట్టా. అలాగే మరో సినిమా హీరోయిన్ సుహాసిని గురించి వినే వుంటారు. దేవత సీరియల్ లో ‘రుక్మిణి’గా అలరిస్తోంది. ఈ బ్యూటీ రోజుకు 25 వేల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఇక బుల్లితెర అనుష్క‌గా పేరు సంపాదించికున్న ప‌ల్ల‌వి రామిశెట్టి గురించి తెలుసు కదా. పల్లవి రోజుకు 15వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోందని సమాచారం.

Share post:

Latest