దద్దరిల్లిపోతున్న అన్ స్టాపబుల్.. ప్రోమో..!!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో బుల్లితెరపై హోస్టుగా కూడా అన్ స్టాపబుల్ షోకి వ్యవహరిస్తూ ఉన్నారు. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్నది. బాలయ్యకు పోటీగా ఎంతో మంది హీరోల సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి ఇప్పుడు పోస్ట్ గా రెండవ సీజన్లో విజయవంతంగా ముందుకు వెళుతున్నారు బాలకృష్ణ. ఇప్పటివరకు నాలుగు ఎపిసోడ్లను పూర్తి చేసిన బాలయ్య తాజాగా ఐదవ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో వైరల్ గా మారుతోంది వాటి గురించి తెలుసుకుందాం.

Unstoppable 2 Episode 5 promo | చిరంజీవి, బాలకృష్ణతో సినిమా‌.. అన్‌స్టాప‌బుల్ 2 తాజా ప్రోమో వైరల్ఇక ఈ ప్రోమో విషయానికి వస్తే గెస్ట్లుగా అల్లు అరవింద్, రామానాయుడు, రాఘవేందర్రావు, కోదండరామిరెడ్డి రావడం జరిగింది.ఈ ప్రోమోలో అల్లు అరవింద్ ని బాలకృష్ణ మన కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుంది అని అడగగా ఈ ప్రశ్నకు సమాధానంగా అల్లు అరవింద్ మిమ్మల్ని చిరంజీవి గారిని కలిపి ఒక సినిమా చేయాలని ఉందని చెప్పడంతో బాలయ్య అప్పుడు చిరునవ్వుతో నేను చిరంజీవి కలిసి నటిస్తే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని తెలియజేశారు. దీంతో పలు రకాలుగా అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.

రామానాయుడు, అరవింద్ ,బాలయ్య మధ్య జరిగే కొన్ని ఫన్నీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా ఇక అంతేకాకుండా అల్లు అరవింద్ తమ కుటుంబం పై జరిగేటువంటి ట్రోల్స్ పై కూడా స్పందిస్తూ ఉన్నట్లుగా ఈ ప్రోమోలో కనిపిస్తోంది. అలాగే రామానాయుడు అల్లు అరవింద్ మధ్య జరిగే కొన్ని సీక్రెట్స్ కూడా ఈ షోలో బయటపడేలా కనిపిస్తున్నాయి.అలాగే ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా బాలయ్య చివరిలో అద్భుతమైన డైలాగులు చెప్పి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.

Share post:

Latest